Vehicle Sales: ఆగ‌స్టులో పెరిగిన ప్ర‌యాణికుల వాహ‌న‌ అమ్మ‌కాలు!

పండుగ సీజ‌న్ ఇప్పుడే మొద‌ల‌యింద‌ని, ద్విచ‌క్ర వాహ‌నాల అమ్మ‌కాలు ఈ ఏడాది చివ‌ర‌కు ఇంకా పుంజుకోవ‌చ్చ‌ని పేర్కొంది.

Published : 10 Sep 2022 14:42 IST

వాహ‌నాల‌లో ఉప‌యోగించే చిప్స్ ల‌భ్య‌త మెరుగ‌వ‌డంతో ఆగ‌స్టులో మొత్తం దేశీయ కార్ల విక్ర‌యాలు 17.7% పెరిగి 1,87,000కు చేరుకున్నాయి. ఈ పండుగ సీజ‌న్‌లో ప్ర‌యాణికుల వాహ‌నాలు దశాబ్దపు గ‌రిష్ట స్థాయికి చేరుకోవ‌చ్చ‌ని 'ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఆటోమొబైల్ డీల‌ర్స్ అసోసియేష‌న్ప్ ఆఫ్ ఇండియా' (FADA) తెలిపింది. పండుగ సీజ‌న్ ఇప్పుడే మొద‌ల‌యింద‌ని, ద్విచ‌క్ర వాహ‌న అమ్మ‌కాలు ఈ ఏడాది చివ‌ర‌కు ఇంకా పుంజుకోవ‌చ్చ‌ని పేర్కొంది. గ‌త ఏడాది ఇదే నెల‌తో పోలిస్తే ఆగ‌స్టులో దేశీయ ద్విచ‌క్ర వాహ‌న విక్ర‌యాలు 16% ఎక్కువ‌గా ఉన్నాయి.

వాహ‌న రిజిస్ట్రేష‌న్లు గ‌త నెల‌లో వార్షిక ప్రాతిప‌దిక‌న 8.3% పెరిగాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని