Automobile sales: ఏప్రిల్‌లో కార్లు, టూవీలర్స్ విక్రయాలు తగ్గాయ్: ఫాడా
Automobile retail sales: ద్విచక్ర, ప్రయాణికుల వాహనాల రిటైల్ విక్రయాలు మార్చి నెలతో పోలిస్తే ఏప్రిల్ కొంచెం మేరకు తగ్గాయి.
దిల్లీ: దేశంలో ద్విచక్ర, ప్రయాణికుల వాహన విక్రయాలు ఏప్రిల్ నెలలో నెమ్మదించాయి. అదే సమయంలో ట్రాక్టర్లు, కమర్షియల్ వాహన రిజిస్ట్రేషన్లు పెరిగాయని ఆటోమొబైల్ డీలర్స్ సంఘం ఫాడా (FADA) వెల్లడించింది. ఏప్రిల్ నెలలో ప్రయాణికుల వాహనాల రిటైల్ విక్రయాలు మార్చి నెలతో పోలిస్తే 1 శాతం తగ్గాయని ఫాడా వెల్లడించింది. గత ఏప్రిల్ నెలలో రిటైల్ విక్రయాలు 2,86,539 యూనిట్లు కాగా.. ఈ ఏడాది 2,82,674 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కఠిన ఉద్గార నిబంధనలు ఇందుకు నేపథ్యం. ధరల పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని చాలా మంది కొనుగోలుదారులు మార్చిలోనే వాహనాలను కొనుగోలు చేయడంతో ఏప్రిల్‌లో విక్రయాలు తగ్గాయని ఫాడా పేర్కొంది.
ఇక ద్విచక్ర వాహన రిజిస్ట్రేషన్లు 7 శాతం తగ్గాయి. గత సంవత్సరం ఏప్రిల్ నెలలో 13,26,773 యూనిట్ల ద్విచక్ర వాహనాలు అమ్ముడవ్వగా.. ఈ ఏడాది ఆ సంఖ్య 12,29,911 యూనిట్లకు తగ్గింది. అదే సమయంలో వాణిజ్య వాహన రిజిస్ట్రేషన్లు మాత్రం 2 శాతం పెరిగి 85,587 యూనిట్లకు చేరుకున్నాయి. త్రిచక్ర వాహన రిటైల్ విక్రయాలు మాత్రం భారీగా పుంజుకున్నాయి. 2022 ఏప్రిల్‌లో 45,114 యూనిట్లతో పోలిస్తే 57 శాతం పెరిగి 70,928 యూనిట్లకు చేరాయి. ట్రాక్టర్ విక్రయాలు సైతం 1 శాతం పెరిగి 55,835 యూనిట్లకు చేరాయని ఫాడా వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
బైక్‌ను ఆపినందుకు.. పోలీసులపై మహిళ వీరంగం
-
Nara Bhuvaneswari: చంద్రబాబు ఏం తప్పు చేశారని జైల్లో నిర్బంధించారు?: నారా భువనేశ్వరి
-
Ganesh Immersion: ట్యాంక్ బండ్లో పీవోపీ విగ్రహాల నిమజ్జనం చేయొద్దు: హైకోర్టు
-
Disease X: మరో మహమ్మారి ముప్పు పొంచి ఉంది: బ్రిటన్ శాస్త్రవేత్తలు
-
IND w Vs SL w: జెమీమా, మంధాన కీలక ఇన్నింగ్స్‌లు.. భారత్ స్కోరు 116/7
-
2000 Note: ₹2 వేల నోట్ల మార్పిడికి ఇంకా 5 రోజులే గడువు!