Patanjali Group: వచ్చే ఐదేళ్లలో పతంజలి గ్రూప్‌ నుంచి 4 ఐపీఓలు

ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ సంస్థ పతంజలీ గ్రూప్‌ టర్నోవర్‌ వచ్చే 5-7 ఏళ్లలో 2.5 రెట్లు పెరిగి రూ.లక్ష కోట్లకు చేరుతుందని కంపెనీ సహ-వ్యవస్థాపకుడు బాబా రామ్‌దేవ్‌ తెలిపారు....

Published : 16 Sep 2022 23:28 IST

దిల్లీ: ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ సంస్థ పతంజలీ గ్రూప్‌ టర్నోవర్‌ వచ్చే 5-7 ఏళ్లలో 2.5 రెట్లు పెరిగి రూ.లక్ష కోట్లకు చేరుతుందని కంపెనీ సహ-వ్యవస్థాపకుడు బాబా రామ్‌దేవ్‌ అంచనా వేశారు. అలాగే వచ్చే ఐదేళ్లలో నాలుగు గ్రూప్‌ కంపెనీల ఐపీఓ కూడా ఉండనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అలాగే రానున్న కొన్నేళ్లలో దాదాపు 5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ప్రస్తుతం పతంజలి గ్రూప్‌ టర్నోవర్‌ రూ.40,000 కోట్లుగా ఉన్నట్లు పేర్కొన్నారు.

ఇప్పటికే పతంజలి ఫుడ్స్‌ (గతంలో రుచిసోయా) స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదైనట్లు బాబా రామ్‌దేవ్‌ గుర్తుచేశారు. ఈ కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.50 వేల కోట్లుగా ఉందని తెలిపారు. వచ్చే ఐదేళ్లలో పతంజలి ఆయుర్వేద్‌, పతంజలి మెడిసిన్‌, పతంజలి లైఫ్‌స్టైల్‌, పతంజలి వెల్‌నెస్‌ను పబ్లిక్‌ ఇష్యూకు తీసుకురానున్నట్లు వెల్లడించారు. రూ.4,300 కోట్లకు రుచి సోయాను పతంజలి సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తర్వాత దాన్ని ‘పతంజలి ఫుడ్స్‌’గా పేరు మార్చి ‘ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫరింగ్‌’కు వెళ్లింది. తమ ఉత్పత్తులన్నీ నాణ్యమైనవని రామ్‌దేవ్‌ పునరుద్ఘాటించారు. కొన్ని రాజకీయ, మతపరమైన, ఔషధరంగ, బహుళజాతి కంపెనీల మాఫీయాలు తమ బ్రాండ్‌ ప్రతిష్ఠను దిగజార్చేందుకు కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. ఇప్పటి వరకు దాదాపు 100 మందికి న్యాయపరమైన నోటీసులు ఇచ్చామని పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts