ఆన్లైన్ ద్వారా ఎల్ఐసీ ప్రీమియం ఎలా చెల్లించాలి?

ఎల్ఐసీ తమ చందాదారులకు కోసం కొన్ని ఆన్లైన్ చెల్లింపు విధానాలను ప్రవేశపెట్టింది

Published : 20 Dec 2020 17:15 IST

ఎల్ఐసీ ప్రీమియం చెల్లించడానికి ప్ర‌తీసారి సంబంధిత ఎల్ఐసీ శాఖకు వెళ్లడం ఇబ్బందికరంగా ఉందా? ఆన్లైన్ ద్వారా ఎల్ఐసీ ప్రీమియం చెల్లించడం ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం. ఎల్ఐసీ తమ చందాదారులకు కోసం కొన్ని ఆన్లైన్ చెల్లింపు విధానాలను ప్రవేశపెట్టింది. దీని కోసం మీరు ఎల్ఐసీ వెబ్ సైటును గానీ ఎల్ఐసీ ఇండియా యాప్ ను గానీ తెర‌వాలి.

ఈ రెండు విధానాల్లో ఎల్ఐసీ ప్రీమియం ఎలా చెల్లించాలో ఇప్పుడు చూద్దాం.

ఎల్ఐసీ వెబ్ సైట్ ద్వారా చెల్లింపు

ఎల్ఐసీ వెబ్ సైట్ ద్వారా ప్రీమియం చెల్లించేందుకు ముందుగా మీరు (డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎల్ఐసీఇండియా.ఇన్)
వెబ్సైట్ లోకి వెళ్లి అక్కడ ఆన్లైన్ సర్వీసెస్ పోర్టల్లో పే ప్రీమియం ఆన్లైన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అప్పుడు మీకు రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి.

LIC-1.jpg

LIC-2.jpg

  1. పే డైరెక్ట్ (లాగిన్ లేకుండా)

  2. కస్టమర్ పోర్టల్ ద్వారా

1) పే డైరెక్ట్ (లాగిన్ లేకుండా)

పోర్టల్ లో రిజిస్టర్ అవ్వడం ఇష్టం లేనివారు పే డైరెక్ట్ ఎంపిక చేసుకోవచ్చు. ఈ ఎంపిక ద్వారా మీరు మూడు రకాల చెల్లింపులు చేయవచ్చు.
a) ప్రీమియం పేమెంట్
b) లోన్ రీపేమెంట్
c) లోన్ ఇంట్రస్ట్ రీపేమెంట్

స్టెప్ 1 : ఎల్ఐసీ ప్రీమియం చెల్లించడానికి ప్రీమియం పేమెంట్ ఆప్షన్ ను ఎంపిక చేసుకోండి.

LIC-3.jpg

స్టెప్ 2 : ప్రీమియం చెల్లింపు విధానాన్ని వివరిస్తూ మీ కంప్యూటర్ స్క్రీన్ పై పాప్-అప్ వస్తుంది. అనంతరం “ప్రొసీడ్” అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.

LIC-4.jpg

స్టెప్ 3 : మీ పాలసీ నెంబరు, వాయిదా ప్రీమియం (పన్నులను మినహాయించి) మొదలైన వివరాలను నమోదు చేయాలి. వివరాలను నమోదు చేస్తున్నప్పుడు సరిగ్గా, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలి. లేకుంటే సెషన్ గడువు పూర్తవుతుంది. అప్పుడు మీరు మళ్లీ మొత్తం ప్రక్రియను ప్రారంభించాలి.

LIC-5.jpg

స్టెప్ 4 : క్యాపచ్చి కోడ్ ను నమోదు చేసి “ఐ అగ్రీ” అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసి “సబ్మిట్” పై క్లిక్ చేయండి.
స్టెప్ 5 : మీరు పైన తెలిపిన వివరాలను ధృవీకరించి స‌బ్‌మిట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఒకవేళ మీకు ఒకటి కంటే ఎక్కువ ఎల్ఐసీ పాలసీలు ఉన్నట్లయితే మీరు చెల్లించాల్సిన పాలసీ నెంబర్ ను కిందకి స్క్రోల్ చేయటం ద్వారా కనుగొని దానిపై క్లిక్ చేయండి. అనంతరం ప్రొసీడ్ పై క్లిక్ చేయండి.

LIC-6.jpg

స్టెప్ 6 : తదుపరి దశలో మీకున్న మొత్తం పాలసీలలో ప్రీమియం చెల్లించవలసిన పాలసీ, దానికి చెల్లించాల్సిన ప్రీమియం వివరాలు కనిపిస్తాయి. అనంతరం చెక్ అండ్ పే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

LIC-7.jpg

స్టెప్ 7 : ఈ దశలో ప్రీమియం చెల్లించడానికి మీకు మూడు ఆప్షన్లు ఉంటాయి.
a) ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఈ-వాల్లెట్స్ , క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, అమెరికన్ ఎక్సప్రెస్ కార్డుల ద్వారా
b) స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ యూపీఐ
c) యాక్సిస్ పే యూపీఐ.

స్టెప్ 8 : మీరు చెల్లింపు చేయాలనుకునే ఆప్షన్ ను ఎంచుకోండి.

2) కస్టమర్ పోర్టల్ ద్వారా

మీరు ఇప్పటికే ఎల్ఐసీ ఇండియా పోర్టల్ లో రిజిస్టర్ అయినట్లైతే, పాలసీ ప్రీమియం చెల్లించడానికి పోర్టల్ లో లాగిన్ అవొచ్చు. లేదంటే రిజిస్టర్ అవ్వవలసి ఉంటుంది.
రిజిస్టర్ అవ్వడానికి ‘సైన్ అప్’ ఆప్షన్ పై క్లిక్ చేయండి. అనంతరం మీ పాలసీ నెంబరు, ప్రీమియం మొత్తం (పన్ను మినహాయించి), పుట్టిన తేదీ, మొబైల్ నంబర్, ఈ-మెయిల్ వంటి వివరాలను తప్పనిసరిగా నమోదు చేయవలసి ఉంటుంది. రిజిస్టర్ అయిన తరువాత ప్రీమియం చెల్లించడానికి వెబ్సైట్ లో లాగిన్ అవ్వవలసి ఉంటుంది.

LIC-8.jpg

స్టెప్ 1 : మీ వివరాలను నమోదు చేసి ఖాతాలో లాగిన్ అవ్వండి.

STEP-1.jpg

స్టెప్ 2 : లాగిన్ అయిన తరువాత “ఆన్లైన్ పేమెంట్స్” అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. అది మిమల్ని పేమెంట్ ఆప్షన్ కు తీసుకెళ్తుంది.

STEP-2.jpg

స్టెప్ 3 : మీరు ఏ పాలసీకి ప్రీమియం చెల్లించాలని అనుకుంటున్నారో ఆ పాలసీ పై క్లిక్ చేసి “చెక్ అండ్ పే” ఆప్షన్ పై క్లిక్ చేయండి.

STEP-3.jpg

స్టెప్ 4 : మీ వివరాలను మరోసారి నిర్ధ‌రించేందుకు మొబైల్ నంబర్, ఈ-మెయిల్, ప్రీమియం మొత్తం వివరాలను అడుగుతుంది. వివరాలను నిర్ధారించిన తర్వాత ‘చెక్ అండ్ పే’ పై క్లిక్ చేయండి.
స్టెప్ 5 : మీ ప్రీమియంను చెల్లించడానికి సరైన చెల్లింపు గేట్ వేను ఎంచుకోండి.

STEP-5.jpg

మీరు ‘పే డైరెక్ట్’ లేదా ‘కస్టమర్ పోర్టల్’ ఆప్షన్లను ఉపయోగించినప్పుడు కింద తెలిపిన విధంగా చార్జీలను చెల్లించవలసి ఉంటుంది.

చెల్లింపులు జరిపేటప్పుడు గమనించవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు

  1. సరైన, పనిచేసే మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ను అందించండి.

  2. చెల్లింపును నిర్ధరించే ర‌శీదు మీ ఈ-మెయిల్ కు అందుతుంది.

  3. స్వయంగా పాలసీదారుడే ఆన్లైన్ ప్రీమియంను చెల్లించాలి. మూడవ పార్టీ చెల్లింపులను వాడకూడదు.

  4. మీ బ్యాంకు ఖాతా నుంచి ప్రీమియం మొత్తం డెబిట్ అయిన తరువాత మీ కంప్యూటర్ స్క్రీన్ పై ఎర్రర్ మెసేజ్ వచ్చినట్లైతే మీరు ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదు. మీరు చెల్లింపు చేసిన మూడు రోజుల తరువాత చెల్లింపు తాలూకా ర‌శీదు మీ ఈ-మెయిల్ కు అందుతుంది.

  5. మళ్లీ చెల్లింపుకు ప్రయత్నించకండి :
    ఆన్లైన్ ద్వారా చెల్లింపు చేసినప్పటికీ మీకు రశీదు రాకపోతే లేదా ఎర్రర్ మెసేజ్ వచ్చినా మీరు మరొకసారి చెల్లింపు చేయడానికి ప్రయత్నించకండి. మొదట మీ ఖాతా లో డబ్బు డెబిట్ అయ్యిందో లేదో తనిఖీ చేసుకోండి. ఒకవేళ డెబిట్ అయితే మూడు రోజుల్లో మీ ఈ మెయిల్ కు రశీదు వస్తుంది. అప్పటి వరకు ఎదురు చూడండి.

  6. ఆన్లైన్ పోర్టల్ దేశీయ బ్యాంకుల ద్వారా జారీ చేయబడిన క్రెడిట్/డెబిట్ కార్డులను మాత్రమే అంగీకరిస్తుంది. అంతర్జాతీయ బ్యాంకుల క్రెడిట్/డెబిట్ కార్డులను అంగీకరించదు.

యాప్ ద్వారా చెల్లింపు

పాలసీదారుడు తన మొబైల్ ఫోన్లో ఎల్ఐసీ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా కూడా పాలసీ ప్రీమియం చెల్లించవచ్చు. పాలసీదారుల కోసం ఎల్ఐసీ మూడు యాప్లైన ఎల్ఐసీ కస్టమర్, ఎల్ఐసీ పే డైరెక్ట్, మై ఎల్ఐసీ లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిని పాలసీదారుడు గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఎల్ఐసీ కస్టమర్

ఈ యాప్ ద్వారా పాలసీదారులు తమ పాలసీ చెల్లింపులను “పే డైరెక్ట్” ద్వారా గానీ రిజిస్టర్ అవ్వడం ద్వారా గానీ చేసుకోవచ్చు. యాప్ ద్వారా చేసే చెల్లింపుల ప్రక్రియ వెబ్సైట్ లో చేసే చెల్లింపుల మాదిరిగానే ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని