గూగుల్‌కు బిగ్ షాక్‌.. 30 రోజుల్లో ₹1,337కోట్ల ఫైన్‌ చెల్లించాల్సిందే: NCLAT ఆదేశం

సీసీఐ ఇచ్చిన ఉత్తర్వులపై NCLATలో సవాల్‌ చేసిన గూగుల్‌కు గట్టి షాక్‌ తగిలింది. సీసీఐ విధించిన రూ.1337.76 కోట్ల జరిమానాను 30 రోజుల్లోపు చెల్లించాల్సిందేనంటూ ఎన్‌సీఎల్‌ఏటీ గూగుల్‌ను ఆదేశించింది.

Updated : 29 Mar 2023 17:16 IST

దిల్లీ: ప్రముఖ సెర్చింజిన్‌ దిగ్గజం గూగుల్‌(Google)కు మరోసారి గట్టి షాక్‌ తగిలింది.  ఆండ్రాయిడ్‌ మొబైల్‌ డివైజ్‌ ఎకో సిస్టమ్‌లో తన ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేసినందుకు గాను గూగుల్‌కు గతంలో కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (CCI) భారీ జరిమానా విధించిన విషయం తెలిసిందే.ఆ విషయంలో గూగుల్‌ జాతీయ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (NCLAT)ను ఆశ్రయించగా ఎదురు దెబ్బ తగిలింది. 30 రోజుల్లోపు  సీసీఐ విధించిన జరిమానా రూ.1337.76 కోట్లను డిపాజిట్‌ చేయాల్సిందేనని ఎన్‌సీఎల్‌ఏటీ తేల్చి చెప్పింది. ఈ మేరకు ఇద్దరు సభ్యులతో కూడిన ఎన్‌సీఎల్‌ఏటీ బెంచ్‌ బుధవారం గూగుల్‌కు ఆదేశాలు జారీ చేసింది.

గతేడాది అక్టోబర్‌ 20న కాంపిటేషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా గూగుల్‌కు రూ.1337.76 కోట్ల జరిమానా విధించిన విషయం తెలిసిందే.  అలాగే, అనైతిక వ్యాపార పద్ధతులను మానుకోవాలని, తన ప్రవర్తనను మార్చుకోవాలని కూడా హితవు పలికింది.  అయితే, సీసీఐ ఆదేశాలను సవాల్‌ చేస్తూ గూగుల్‌ నేషనల్‌ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించింది. దీనిపై బుధవారం విచారించిన ఎన్‌సీఎల్‌ఏటీ గూగుల్‌ పిటిషన్‌ను తిరస్కరించింది.  సీసీఐ విచారణలో సహజ న్యాయ ఉల్లంఘనలేమీ జరగలేదని తేల్చి చెప్పింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని