కోవిడ్ చికిత్స‌లో.. ఎంత వ‌రకు న‌గ‌దు రూపంలో చెల్లించ‌వ‌చ్చు..

ఆదాయపు ప‌న్ను చ‌ట్టం ప్ర‌కారం రూ.2 ల‌క్ష‌లకు మించి న‌గ‌దు రూపంలో లావాదేవీలు చేయ‌కూడదు. 

Updated : 15 May 2021 15:56 IST

కోవిడ్‌-19 చికిత్సకు అయ్యే ఖ‌ర్చు విష‌యంలో.. న‌గ‌దు రూపంలో చేసే చెల్లింపుల‌కు కొంత వెసులు బాటను ఇస్తూ ఆదాయపు ప‌న్ను శాఖ ఇటీవ‌లే నిర్ణ‌యం తీసుకుంది. ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం 1961లోని సెక్షన్ 269 ఎస్టీ ప్రకారం రూ.2 ల‌క్ష‌లకు మించి న‌గ‌దు రూపంలో చెల్లింపులు చేసే వీలులేదు. ఈ కార‌ణంగా ఆసుప‌త్రిలో బిల్లు చెల్లింపుల‌కు పేషెంట్ల బంధ‌వులు ఇబ్బంది ప‌డుతున్నారు. అందువ‌ల్ల ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌దరు శాఖ తెలిపింది. నోటిఫికేష‌న్ ప్ర‌కారం కోవిడ్ చికిత్స నిమిత్తం రూ.2 ల‌క్ష‌లు, అంత‌కు మించి అయిన ఆసుప‌త్రి బిల్లును న‌గ‌దు రూపంలో చెల్లించ‌వ‌చ్చ‌ని తెలిపింది. ఇది ఏప్రిల్ 1 నుంచి మే 30 వ‌ర‌కు నిర్వ‌హించే కోవిడ్ చికిత్స  లావాదేవీల‌కు మాత్ర‌మే ఇది వ‌ర్తిస్తుంద‌ని స్ప‌ష్టం చేసింది. అయితే ఆసుప‌త్రి వారు పేషెంట్‌తో పాటు, డ‌బ్బు చెల్లించిన పేషెంట్ బంధువు/ స్నేహితుని ఆధార్ కార్డు, పాన్ కార్డు కాపీల‌ను, బంధుత్వ వివ‌రాల‌ను తీసుకోవాల‌ని తెల‌పింది.

రూ.2 ల‌క్ష‌ల మించి న‌గ‌దు రూపంలో లావాదేవీలపై నిషేదం ఉంది. ఉదాహ‌ర‌ణ‌కు, మీరు రూ.3 ల‌క్ష‌ల రూపాయిలు విలువైన ఆభ‌ర‌ణాల‌ను కొనుగోలు చేశార‌నుకుందాం. కొనుగోలు విలువ అనుమ‌తించిన ప‌రిమితి కంటే ఎక్కువ‌గా ఉన్న కార‌ణం చేత న‌గ‌దు రూపంలో చెల్లింపులు చేయ‌కూడ‌దు. 

ఒక వ్య‌క్తి, అత‌ను/ ఆమె ద‌గ్గ‌రి బంధువుల నుంచైనా స‌రే, ఒక రోజులో ఈ ప‌రిమితికి మించి తీసుకోకూడ‌దు. అయితే కొన్ని లావాదేవీల‌కు మాత్రం దీని నుంచి మిన‌హాయింపు ఉంది. ఉదాహ‌ర‌ణ‌కు, వ్యాపారం చేసే వ్య‌క్తి, వ్యాపారంలో భాగంగా వేరు వేరు వ్య‌క్తుల నుంచి ప‌రిమితుల‌కు లోబ‌డి తీసుకున్న మొత్తం విలువ రూ. 2 ల‌క్ష‌లు మించి ఉన్న‌ప్ప‌టికీ బ్యాంకు ఖాతాలో జ‌మ‌చేసుకోవ‌చ్చు. 

రుణాలు, ఆస్తుల‌పై ప‌రిమితులు..
ఒక‌వ్య‌క్తి ఏదైనా ఆర్థిక సంస్థ నుంచి స్నేహితుని వ‌ద్ద నుంచి రుణం తీసుకున్నాడ‌నుకుందాం. అత‌ను రూ.20వేల కంటే ఎక్కువ మొత్తాన్ని న‌గ‌దు రూపంలో తీసుకోకూడ‌దు. ఇదే నియ‌మం రుణం తిరిగి చెల్లించ‌డంలోనూ వ‌ర్తిస్తుంది. అత‌ను/ ఆమె తీసుకున్న రుణాన్ని బ్యాంక్ ద్వారా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. 

ఆస్తికి సంబంధించిన లావాదేవీలలోనూ గ‌రిష్ట ప‌రిమితి రూ.20వేలు. ఆస్తి అమ్మే వ్య‌క్తి అడ్వాన్సు తీసుక‌న్న‌ప్పుడు కూడా రూ.20వేల వ‌ర‌కు మాత్ర‌మే న‌గ‌దు రూపంలో తీసుకోవ‌చ్చు. మిగిలిన మొత్తాన్ని బ్యాంకు ద్వారా ట్రాన్స్‌ఫ‌ర్ చేయ‌మ‌ని కొనుగోలు దారునికి తెలియ‌జేయాలి. 

వ్యాపారానికి వ్య‌యానికి సంబంధించి..
వ్యాపారంలో కూడా ప‌రిమితికి మంచి న‌గ‌దు రూపంలో తీసుకోకూడ‌దు. ఒక వ్యాపార య‌జ‌మాని రూ.10 వేల కంటే ఎక్కువ న‌గ‌దు లావాదేవీలు చేస్తే, అత‌ను ఆ మొత్తాన్ని ఖ‌ర్చుగా, త‌రుగుద‌ల‌(డిప్రిసియేష‌న్‌)గా క్లెయిమ్ చేయ‌లేడు. 

ప‌న్ను-ఆదా..
ప‌న్ను -ప్ర‌ణాళిక వేసేప్పుడు ఆరోగ్య బీమా ప్రీమియం న‌గ‌దు రూపంలో చెల్లించ‌కుండా చూసుకోండి. న‌గ‌దు రూపంలో చెల్లించిన బీమా ప్రీమియంపై సెక్ష‌న్ 80డి కింద ల‌భించే ఆదాయ‌పు ప‌న్ను ప్ర‌యోజ‌నం వ‌ర్తించ‌దు. అందువ‌ల్ల బ్యాంకు ఛాన‌ల్‌ ద్వారా మాత్ర‌మే ప్రీమియం చెల్లింపులు చేయ‌డం త‌ప్ప‌నిస‌రి. 

చివ‌రిగా..
న‌గ‌దు రూపంలో చేసే లావాదేవీల‌పై తీసుకునే వ్య‌క్తులు మ‌రింత భాద్య‌త‌గా ఉండాలి. ఎందుకంటే చాలా వ‌ర‌కు సంద‌ర్భాల‌లో డ‌బ్బు తీసుకునే వ్య‌క్తికే ఆదాయ‌పు ప‌న్నుశాఖ‌ జ‌రిమానా విధిస్తుంది. ఎవ‌రైనా న‌గ‌దు రూపంలో ఇస్తాన‌న్నా రిజిక్ట్ చేయ‌డం మంచింది. న‌గ‌దు తీసుకుని వెంట‌నే బ్యాంకులో డిపాజిట్ చేసిన.. వాటిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోరు. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని