‘Paytm బైబ్యాక్.. IPO నిధుల్ని ఉపయోగించడం కుదరదు’
Paytm Buyback: ఐపీఓలో సమీకరించిన నిధుల్ని పేటీఎం షేర్ల బైబ్యాక్‌కు ఉపయోగించుకోవడం కుదరని నిపుణులు చెప్పారు.
దిల్లీ: షేర్ల బైబ్యాక్ కోసం పేటీఎం (Paytm) మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ డిసెంబరు 13న భేటీ కానుంది. అయితే, ఐపీఓలో సమీకరించిన నిధులతో పేటీఎం (Paytm) తమ సొంత షేర్లను కొనుగోలు చేయడం కుదరదని నిపుణులు తెలిపారు. అందుకు నిబంధనలు అంగీకరించవన్నారు. అలాంటప్పుడు పేటీఎం (Paytm) తమ వద్ద ఉన్న ద్రవ్యలభ్యతను బైబ్యాక్ (Buyback) కోసం ఉపయోగించుకోవచ్చని సూచించారు. తమ వద్ద రూ.9,182 కోట్ల ద్రవ్యలభ్యత ఉందని ఇటీవలి త్రైమాసిక నివేదికలో పేటీఎం తెలిపింది.
అనేక అంచనాల మధ్య ఐపీఓకి వచ్చిన పేటీఎం (Paytm).. స్టాక్ మార్కెట్ల ముందు బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. 2022లో ఇప్పటి వరకు ఈ స్టాక్ 60 శాతం నష్టపోయింది. ప్రపంచవ్యాప్తంగా కొత్తతరం టెక్ కంపెనీ షేర్లలో అమ్మకాలు, సంస్థ లాభదాయకతపై అనుమానాలే ఈ స్టాక్ కొంపముంచాయి. ఈ నేపథ్యంలో మదుపర్లలో విశ్వాసం నింపడం కోసం షేర్ల బైబ్యాక్ (Buyback) ప్రతిపాదనతో పేటీఎం ముందుకొచ్చింది. ఇందుకోసం ఐపీఓలో సమీకరించిన నిధుల్ని ఉపయోగించుకోనుందంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అలా చేయడం కుదరదని నిపుణులు చెబుతున్నారు. అయితే, కంపెనీ మాత్రం దీనిపై ఇంకా స్పందించలేదు.
సాధారణంగా కంపెనీలు తమ వద్ద అధిక నగదు ప్రవాహం ఉన్నప్పుడు బైబ్యాక్ (Buyback)కు వెళుతుంటాయి. లేదా స్టాక్ ధర అంతర్గత విలువ కంటే దిగువకు చేరినప్పుడు కంపెనీలు తమ షేర్లను తామే కొనుగోలు చేస్తుంటాయి. ప్రస్తుతం పేటీఎం (Paytm) రెండో పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో బైబ్యాక్ (Buyback) నిర్ణయం సరైనదేనని నిపుణులు చెబుతున్నారు. కానీ, ఐపీఓ నిధులను మాత్రం అందుకు వినియోగించొద్దని తెలిపారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Aaftab: శ్రద్ధాను చంపి.. చికెన్ రోల్ తిన్నాడు
-
India News
రూ.50వేల చొప్పున తీసుకున్నారు.. భర్తల్ని వదిలేసి ప్రియుళ్లతో వెళ్లిపోయారు
-
Crime News
Crime News: మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ భార్య బలవన్మరణం
-
Politics News
Kotamreddy: అభిమానం ఉండాలి.. రూ.కోట్లుంటే గెలవలేరు: కోటంరెడ్డి
-
Politics News
జగన్ గ్రాఫ్ పడిపోతోంది.. ఏపీ వెళ్లి పాదయాత్ర చేసుకో: షర్మిలకు కడియం సూచన
-
World News
Turkey- syria Earthquake: అద్భుతం.. మృత్యుంజయులుగా బయటకొచ్చిన చిన్నారులు