Credit card- UPI: పేటీఎంలో రూపే క్రెడిట్‌ కార్డుతో యూపీఐ చెల్లింపులు

ఇప్పుడు పేటీఎంలో రూపే క్రెడిట్‌ కార్డుల చెల్లింపులను పాయింట్‌-ఆఫ్‌-సేల్‌ (పీఓఎస్‌) టెర్మినల్‌ అవసరం లేకుండా చేయొచ్చు.

Published : 09 Feb 2023 14:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ పేటీఎంకు చెందిన పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ (Paytm Payments Bank) వినియోగదారులు ఇకపై రూపే క్రెడిట్‌ కార్డ్‌తో (Rupay credit card) యూపీఐ (UPI) చెల్లింపులు చేయొచ్చు. తమ రోజువారీ లావాదేవీల కోసం యూపీఐని ఉపయోగించే లక్షల మంది వినియోగదారులకు ఉపయోగపడుతుంది. రూపే క్రెడిట్‌ కార్డులను ఇప్పుడు నేరుగా యూపీఐ ఐడీలకు లింక్‌ చేసి క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయడం ద్వారా వ్యాపారులకు సులభంగా చెల్లింపులు చేయొచ్చు.

రూపే క్రెడిట్‌ కార్డులను అన్ని ప్రధాన బ్యాంకులు జారీ చేస్తున్నాయి. పేటీఎం లాంటి మొబైల్ యాప్స్‌లో కార్డు పేమెంట్స్ సౌకర్యం ఉండడం వల్ల రూపే క్రెడిట్ కార్డ్స్ వినియోగం కూడా పెరుగుతుందని భావిస్తున్నారు.  పేటీఎంతో పాటు ఈ సదుపాయాన్ని మోబిక్విక్ యాప్ కూడా ప్రారంభించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని