Paytm: పేటీఎం షేర్లు అందుకే పడ్డాయట.. సీఈఓ వివరణ!

పేటీఎం బ్రాండ్‌ పేరిట కార్యకలాపాలు నిర్వహిస్తున్న వన్‌97కమ్యూనికేషన్స్‌ షేర్లు ఇటీవల భారీగా పతనమయ్యాయి....

Published : 06 Apr 2022 15:18 IST

దిల్లీ: పేటీఎం బ్రాండ్‌ పేరిట కార్యకలాపాలు నిర్వహిస్తున్న వన్‌97కమ్యూనికేషన్స్‌ షేర్లు ఇటీవల భారీగా పతనమయ్యాయి. దీనిపై కంపెనీ సీఈఓ విజయ్‌ శేఖర్ శర్మ స్పందించారు. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలో నెలకొన్న ఒడుదొడుకుల వల్లే షేర్లు కుంగుబాటుకు గురయ్యాయని వివరించారు. ఈ మేరకు ఆయన కంపెనీ వాటాదారులకు బుధవారం లేఖ రాశారు.

రానున్న కొన్ని సంవత్సరాల్లో కంపెనీ విశ్లేషకుల అంచనాలను మించి రాణిస్తుందని విజయ్‌ శేఖర్‌ ధీమా వ్యక్తం చేశారు. వరుసగా వచ్చే ఆరు త్రైమాసికాల్లో సంస్థ ఎబిట్‌డా (EBITDA) ఆదాయం ‘బ్రేక్‌ఈవెన్‌’ను చేరుకుంటుందని అంచనా వేశారు. పేటీఎం గత ఏడాది ఐపీఓకి వచ్చిన విషయం తెలిసిందే. ఇష్యూ ధర రూ.2,150తో పోలిస్తే షేర్లు భారీ కుంగుబాటును చవిచూశాయి. బుధవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో రూ.627 వద్ద చలిస్తోంది. ఇటీవలి మార్కెట్‌ ఒడుదొడుకుల్లో ఓ దశలో ఈ షేరు రూ.520 పడిపోయింది. లేఖలో తెలిపిన వివరాల ప్రకారం.. కంపెనీ షేర్లు తిరిగి ఇష్యూ ధరను దాటిన తర్వాతే సీఈఓ స్టాక్‌ గ్రాంట్లు ఆయనకు చెందనున్నాయి. మార్చి త్రైమాసికంలో కంపెనీ రుణాలు 374 శాతం పెరిగి 60.5 లక్షలకు చేరాయి. విలువపరంగా చూస్తే 417 శాతం వృద్ధి చెంది రూ.3,553 కోట్లకు పెరిగాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని