Pebble: ఆండ్రాయిడ్‌ వెర్షన్‌లో స్మార్ట్‌ఫోన్‌ మినీ.. ప్రకటించిన పెబ్లే

చిన్న ఫోన్‌ అంటే ఇష్టపడే వారి కోసం పెబ్లే (Pebble) స్మార్ట్‌వాచ్‌ కంపెనీ ఆండ్రాయిడ్‌ (Android) వెర్షన్‌లో మినీ స్మార్ట్‌ఫోన్‌ (Mini Smartphone)ను తీసుకురానున్నట్లు ప్రకటించింది. 

Published : 25 Mar 2023 00:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్మార్ట్‌ఫోన్‌ (Smartphone)లు మార్కెట్లోకి వచ్చాక.. ప్రతి ఒక్కరి చేతిలో అరచేతి కంటే పెద్ద సైజు స్క్రీన్‌తో ఉండే ఫోన్లు దర్శనమిస్తున్నాయి. దీంతో చిన్న ఫోన్‌ వాడాలనుకునే వారు కూడా వీటినే ఉపయోగించక తప్పనిసరి పరిస్థితి. కొన్నేళ్ల క్రితం యాపిల్‌ (Apple) కంపెనీ చిన్న స్క్రీన్‌తో ఐఫోన్ ఎస్‌ఈ (iPhone SE) మోడల్‌ను తీసుకొచ్చింది. అప్‌గ్రేడేషన్‌లో భాగంగా దానికి కొనసాగింపుగా తీసుకొచ్చిన ఐఫోన్‌ ఎస్‌ఈ 2, ఎస్‌ఈ 3 మోడ్సల్ స్క్రీన్‌ సైజ్‌లను కూడా పెంచేసింది. తర్వాత ఐఫోన్‌ 13 మోడల్‌లో మినీ వేరియంట్‌ను పరిచయం చేసినప్పటికీ, అమ్మకాల పరంగా నిరుత్సాహపరచడంతో యాపిల్‌ వాటి తయారీని నిలిపివేసింది. తాజాగా పెబ్లే (Pebble) అనే స్మార్ట్‌వాచ్‌ తయారీ కంపెనీ ఆండ్రాయిడ్‌ వెర్షన్‌ మినీ ఫోన్‌ను తీసుకురానున్నట్లు ప్రకటించింది. 

ఇందుకోసం పెబ్లే కంపెనీ వ్యవస్థాపకుడు ఎరిక్‌ మిగికోవ్‌స్కీ (Eric Migicovsky) ఆండ్రాయిడ్ ఫోన్ ప్రాజెక్ట్‌ (Android Phone Project)ను గతేడాది మేలో  ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా పెద్ద కంపెనీలతో కలిసి సాధారణ ఆండ్రాయిడ్ ఫోన్‌ తరహా ఫీచర్స్‌తో ఆండ్రాయిడ్ మినీ (Android Mini) స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేయాలనుకున్నారు. కానీ, పెద్ద స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీలు దీనిపై ఆసక్తి కనబరచకపోవడంతో,  పెబ్లే స్వయంగా ఆండ్రాయిడ్ మినీ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురావాలని నిర్ణయించింది.  ఆండ్రాయిడ్ ఓఎస్‌తో పనిచేసే ఈ ఫోన్‌ చేతిలో ఇమిడిపోయే డిజైన్‌,  అత్యుత్తమ క్వాలిటీ కెమెరా లెన్స్‌, అధిక సామర్థ్యం కలిగిన బ్యాటరీ వంటి ఫీచర్లు ఉంటాయని ఎరిక్‌ తెలిపారు. అలానే పెబ్లే ఆండ్రాయిడ్ మినీ ఫోన్‌తో గూగుల్, శాంసంగ్‌ వంటి కంపెనీలు సైతం మినీ మోడల్స్‌ను తయారు చేస్తాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు