Smartwatch: రూ.3 వేలకే అమోలెడ్‌ డిస్‌ప్లేతో పెబల్‌ స్మార్ట్‌వాచ్‌

Pebble Cosmos Vault: పెబల్‌ మరో కొత్త స్మార్ట్‌వాచ్‌ను భారత్‌లో విడుదల చేసింది. దీని ధర రూ.2,999. దీంట్లో అమోలెడ్‌ డిస్‌ప్లే ఉండడం గమనార్హం.

Published : 25 May 2023 17:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పెబల్‌ కాస్మోస్‌ వాల్ట్‌ స్మార్ట్‌వాచ్‌ (Pebble Cosmos Vault Smartwatch) భారత్‌లో గురువారం విడుదలైంది. దీంట్లో 1.43 అంగుళాల పరిమాణంలో 600 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌తో అమోలెడ్‌ డిస్‌ప్లే ఉంది. బ్లూటూత్‌ కాలింగ్‌ను సపోర్ట్‌ చేస్తుంది. ఈ వాచ్‌ మెటాలిక్‌ బెల్ట్‌తో వస్తోంది. స్టాండ్‌బై మోడ్‌లో బ్యాటరీ లైఫ్‌ 7 రోజుల వరకు వస్తుందని కంపెనీ తెలిపింది.

పెబల్‌ కాస్మోస్‌ వాల్ట్‌ ధర..(Pebble Cosmos Vault Price)

పెబల్‌ కాస్మోస్‌ వాల్ట్‌ స్మార్ట్‌వాచ్‌ (Pebble Cosmos Vault Smartwatch) ధర భారత్‌లో రూ.2,999. పెబల్‌ వెబ్‌సైట్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్‌, మింత్రాలో ఇది విక్రయానికి అందుబాటులో ఉంది. క్లాసిక్‌ సిల్వర్‌, ఒబ్సీడియన్‌ బ్లాక్‌, రోజ్‌ గోల్డ్‌ రంగుల్లో వాచ్‌ లభిస్తుంది.

పెబల్‌ కాస్మోస్‌ వాల్ట్‌ స్పెసిఫికేషన్లు..Pebble Cosmos Vault Specifications

పెబల్‌ కాస్మోస్‌ వాల్ట్‌ స్మార్ట్‌వాచ్‌ (Pebble Cosmos Vault Smartwatch) రౌండ్‌ డయల్‌, మెటాలిక్‌ బాడీతో వస్తోంది. బ్లూటూత్‌ కాలింగ్‌ సపోర్ట్‌ ఉన్న నేపథ్యంలో యూజర్లు నేరుగా వాచ్‌ నుంచే కాల్స్‌ను రిసీవ్‌ చేసుకోవచ్చు. ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ డివైజ్‌లతో దీన్ని కనెక్ట్ చేయొచ్చు. బ్లడ్‌ ఆక్సిజన్‌ మానిటర్‌, డైనమిక్‌ హార్ట్‌రేట్‌ ట్రాకింగ్‌, స్లీప్‌ మానిటరింగ్‌, స్టెప్‌ కౌంటర్‌, మెన్‌స్ట్రువల్‌ సైకిల్‌ ట్రాకింగ్‌ వంటి హెల్త్‌ ఫీచర్లు ఉన్నాయి. అనేక రకాల స్పోర్ట్స్‌ మోడ్‌లు, వాచ్‌ ఫేస్‌లు అందుబాటులో ఉన్నాయి. 240 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని