Pensioners: ఫేస్‌ ఐడీ ద్వారా లైఫ్ స‌ర్టిఫికెట్‌ సమర్పించడం ఎలా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: పెన్ష‌న‌ర్లు క్ర‌మం త‌ప్ప‌కుండా పెన్ష‌న్ పొందేందుకు గానూ.. తాము జీవించి ఉన్నామ‌ని తెలుపుతూ ఏటా జీవిత ధ్రువపత్రం (లైఫ్‌ సర్టిఫికెట్‌) పెన్ష‌న్ ఖాతా ఉన్న‌ బ్యాంకు లేదా పోస్టాఫీసులో స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. ఇందుకోసం పింఛనుదారులు నేరుగా బ్యాంకుకు వెళ్ల‌డం ద్వారా గానీ, డిజిట‌ల్ విధానంలో గానీ ఇప్ప‌టి వ‌ర‌కు స‌ర్టిఫికెట్లను పొందేవారు. అయితే ప్ర‌స్తుతం దీని స్థానంలో 'విశిష్ట ముఖ గుర్తింపు' విధానాన్ని ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టింది. ఈ విధానంలో జీవిత ద్రువపత్రానికి బదులుగా సాంకేతిక ప‌రిజ్ఞానం సాయంతో ఇచ్చే ప‌త్రాన్ని సాక్ష్యంగా ప‌రిగ‌ణిస్తారు. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లకు సుల‌భ‌త‌ర‌ జీవనం ఉండాల‌న్న ప్ర‌ధాని ఆశ‌యంలో భాగంగా వ‌యోవృద్ధుల కోసం ఈ ప‌రిజ్ఞానాన్ని అమ‌లు చేస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం తెలిపింది. ఈ విధానం 68 ల‌క్ష‌ల మంది కేంద్ర ప్ర‌భుత్వ పెన్ష‌న‌ర్ల‌కు మాత్రమే కాకుండా ఈపీఎఫ్‌వో, రాష్ట్ర ప్ర‌భుత్వాల పెన్ష‌న‌ర్లకు కూడా ల‌బ్ధి చేకూరుతుంది అని ప్ర‌భుత్వం తెలిపింది. ప్ర‌త్యేకించి వివిధ కార‌ణాల వ‌ల్ల బ‌యోమెట్రిక్ ఐడీ కోసం ఫింగర్ ప్రింట్‌ స‌బ్మిట్ చేయలేని వారికి ఈ విధానం ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది. UIDAI ఆధార్ సాఫ్ట్‌వేర్ సాయంతో విశిష్ట ముఖ గుర్తింపు స‌ర్వీస్‌ ద్వారా లైఫ్ స‌ర్టిఫికెట్‌ను జ‌న‌రేట్ చేసుకునే విధానం, కావ‌ల‌సిన ప‌త్రాలు, ప్ర‌యోజ‌నాల‌ను పెన్ష‌న్ & పెన్ష‌న‌ర్ల సంక్షేమ శాఖ త‌మ అధికారిక ట్విటర్‌ ఖాతా ద్వారా తెలిపింది. ఆ వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.

'విశిష్ట ముఖ గుర్తింపు' ద్వారా లైఫ్ స‌ర్టిఫికెట్‌ సమర్పించాలంటే..?
* ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌ (వెర్ష‌న్ 7.0 లేదా ఆ త‌ర్వాతిది) అవ‌స‌రం.
ఇంట‌ర్నెట్‌ కనెక్షన్‌ ఉండాలి. 
పెన్ష‌న్ పంపిణీ అధికారుల వ‌ద్ద న‌మోదు చేసిన ఆధార్ నంబర్‌ ఇవ్వాలి. 
కెమెరా రిజల్యూషన్ - 5 MP లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి.

ఎలా స‌బ్మిట్ చేయాలి?
1. ముందుగా గూగుల్ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉన్న ఆధార్ ఫేస్ ఐడీ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. లేదా https://jeevanpramaan.gov.in/ జీవ‌న్ ప్ర‌మాణ్ వెబ్‌సైట్‌కు వెళ్లి ఫేజ్ అప్లికేష‌న్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

2. యాప్‌ని తెరిచి అథ‌రైజేష‌న్ల‌ను ఇవ్వాల్సి ఉంటుంది.

3. అథెంటికేషన్‌ పూర్తిచేసి పెన్షనర్‌ ముఖాన్ని స్కాన్ చేయాలి.

4. ఇప్పుడు మీ డివైజ్ డీఎల్‌సీ (డిజిట‌ల్ లైఫ్ స‌ర్టిఫికెట్‌) జ‌న‌రేష‌న్‌, పెన్ష‌న‌ర్ అథెంటికేషన్‌ సిద్ధ‌మై ఉంటుంది.

5. ఇక్క‌డ పెన్ష‌న‌ర్ స‌మాచారాన్ని పూర్తిచేయాలి.

6. అటు త‌ర్వాత పెన్ష‌న‌ర్‌ను ప్ర‌త్యక్షంగా (లైవ్ ఫోటోగ్రాఫ్‌) స్కాన్ చేయాలి. గ‌మ‌నిక‌: పెన్ష‌న‌ర్ ముఖం స‌రిగ్గా క‌నిపించేలా ఫోటో తీయాలి. ముఖ క‌వ‌ళిక‌లు స‌హ‌జ సిద్ధంగా ఉండాలి. ఫోటో తీసేట‌ప్పుడు లైటింగ్ స‌రిగ్గా ఉండేట్లు చూసుకోవాలి.
7. చివ‌రిగా స‌బ్మిట్ బ‌ట‌న్‌పై క్లిక్ చేయాలి. పెన్ష‌న‌ర్ అథెంటికేషన్‌లో ఇచ్చిన మొబైల్ నంబర్‌కు ఒక లింక్‌తో కూడిన మెసేజ్ వ‌స్తుంది. ఈ లింక్ ద్వారా డీఎల్‌సీ డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

ప్ర‌యోజ‌నాలు..
* బ్యాంకుల‌ను సంద‌ర్శించాల్సిన పనిలేదు.

* ఫేస్ యాప్ ఉప‌యోగించేందుకు ఎలాంటి బయోమెట్రిక్ పరికరం కొనుగోలు చేయాల్సిన‌ అవసరం లేదు.

* సాఫ్ట్‌వేర్ ఫోన్ కెమెరాను ఉపయోగించి ముఖాన్ని క్యాప్చర్ చేస్తుంది కాబ‌ట్టి బ‌యోమెట్రిక్ ప‌డ‌ట్లేదన్న‌ ఆందోళ‌న అవ‌స‌రం లేదు.

* ఏ ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా అయినా ప్ర‌క్రియ పూర్తిచేయ‌వ‌చ్చు.

* జీవన్ ప్రమాణ్ ఫేస్ యాప్ భారతదేశంలో మాత్రమే అందుబాటులో ఉంది. మరెక్కడా అందుబాటులో లేదు.

గ‌మ‌నిక‌..లైఫ్ స‌ర్టిఫికెట్‌ సమర్పించేందుకు కేంద్రం గ‌డువును పొడిగించింది. ఏటా న‌వంబ‌రు 30లోగా పెన్ష‌నర్లు లైఫ్ స‌ర్టిఫికెట్‌ను అందించాలి. అయితే వృద్ధులకు కొవిడ్‌ ముప్పు అధికంగా ఉండడం, మ‌ళ్లీ ప‌లు రాష్ట్రాల్లో క‌రోనా కేసులు వెలుగు చూస్తుండడంతో గ‌డువును డిసెంబ‌రు 31 వ‌ర‌కు పొడిగిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఇంకా లైఫ్ స‌ర్టిఫికెట్‌ స‌మ‌ర్పించని వారు ఇంటి వ‌ద్ద నుంచే లైఫ్ స‌ర్టిఫికెట్‌ను స‌మ‌ర్పించి ఎటువంటి ఆటంకాలూ లేకుండా ప్ర‌తి నెలా పెన్ష‌న్ పొందండి.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని