Fintech: ఆన్‌లైన్‌లో ఫిన్‌టెక్ కంపెనీల రుణాలు

ఇపుడు బ్యాంకుల క‌న్నా ఫిన్‌టెక్ కంపెనీలు వేగంగా 15 నిమిషాల నుండి గ‌రిష్టంగా 72 గంట‌ల్లో వ్య‌క్తిగ‌త రుణాల‌నందిస్తున్నాయి. మొబైల్ ద్వారానే లోన్‌కి ఆన్‌లైన్‌లో ధ‌ర‌ఖాస్తు చేసుకునే విధానాన్ని అమ‌లు చేస్తున్నాయి. ఫిన్‌టెక్ కంపెనీలు డిజిట‌ల్‌గా రుణం తీసుకునే వ్య‌క్తి యొక్క క్రెడిట్ యోగ్య‌త‌ను కొన్ని ప‌రిమితుల ఆధారంగా అంచ‌నా వేస్తారు. ప్ర‌పంచంలోని వేగంగా అభివృద్ధి చెందుతున్న ఫిన్‌టెక్ మార్కెట్ల‌లో భార‌త్ ఒక‌టి. వ్య‌క్తిగ‌త రుణ విభాగంలో ఫిన్‌టెక్ కంపెనీల ప్ర‌భావం చాలా ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. దీనికి బ‌ల‌మైన కార‌ణం రుణాల‌ను పొందే అవ‌కాశం అత్యంత సౌక‌ర్య‌వంతంగా, వేగంగా మార‌డం.

వ్య‌క్తిగ‌త రుణం అంటే అసుర‌క్షిత రుణం. మామూలుగా బ్యాంకులు వ్య‌క్తిగ‌త రుణాల‌నందించ‌డానికి కొన్ని నెల‌ల బ్యాంక్ స్టేట్‌మెంట్, క్రెడిట్ స్కోర్‌, పే స్లిప్‌లు, రుణం తీర్చే కాల వ్య‌వ‌ధి లాంటి ఇంకా ఇత‌ర డాక్యుమెంట్‌ల‌ను భౌతికంగా తీసుకుంటాయి. రుణం ఇవ్వ‌డానికి 7 నుండి 8 ప‌నిదినాలు తీసుకుంటాయి. ఈ వ్య‌వ‌హార‌మంతా వినియోగ‌దారుల‌కు ఇబ్బందిగా ఉండ‌టంతో.. ఫిన్‌టెక్ కంపెనీలు ఈ వ్య‌వ‌హారాన్ని అంత‌టిని డిజిట‌ల్‌గా సుల‌భ‌త‌రం చేసాయి. వినియోగ‌దారులు కూడా వ్య‌క్తిగ‌త రుణాల‌కై ఫిన్‌టెక్ కంపెనీల‌ను ఆశ్ర‌యించ‌టం పెరిగింది.

ఫిన్‌టెక్ కంపెనీలు భౌతిక ప‌త్రాలు అవ‌స‌రం లేకుండా లేక ప‌రిమితం చేసి రుణాలందిస్తున్నాయి. వ్య‌క్తిగ‌త రుణాలు వినియోగ‌దారుల‌కు అంద‌చేయ‌డానికి ముందు ఫిన్‌టెక్ కంపెనీలు క్రెడిట్ స్కోర్‌, ఆదాయం, ఎంప్లాయిమెంట్ హిస్ట‌రీ, పాన్ కార్డ్‌, ఆధార్ కార్డ్‌, పే స్లిప్‌లు, బ్యాంక్ స్టేట్‌మెంట్ వంటి ప‌త్రాల‌ను ఆన్‌లైన్‌లోనే అప్‌లోడ్ చేసే స‌దుపాయాన్ని మోబైల్ యాప్ ద్వారా లేదా వెబ్‌సైట్ ద్వారా అందించి, వినియోగ‌దారున్ని త‌మ వ‌ద్ద‌కు ర‌ప్పించ‌కుండానే రుణాలు అంద‌చేసి సాంకేతిక‌త‌ను బాగా వినియోగించుకుంటున్నాయి. రుణం తీసుకునేవారి ఆధార్ వివ‌రాలు, ఆధార్ లింక్ చేయ‌బ‌డిన మొబైల్ నెంబ‌ర్ ద్వారా రుణ ఒప్పందాల‌పై డిజిట‌ల్ సంత‌కం చేయ‌డానికి `ఇ-కేవైసీ`ని ఉప‌యోగించుకుంటున్నారు. ప్ర‌త్య‌క్షంగా వినియోగ‌దారున్ని క‌ల‌వ‌కుండానే రుణాలు ఇస్తున్నాయి.

చాలా బ్యాంకులు, ఆర్ధిక సంస్థ‌లు ప్రీపేమెంట్ కోసం పెనాల్టీ ఛార్జ్ చేస్తాయి. అయితే ఫిన్‌టెక్ కంపెనీలు ప్రీపేమెంట్‌లో పెనాల్టీ ఛార్జీలు లేకుండా  లేక ప‌రిమితం చేసి బ‌కాయిల‌ను వ‌సూలు చేసుకుంటున్నాయి. అయితే, వ్య‌క్తిగ‌త రుణాల‌కు ఫిన్‌టెక్ కంపెనీలు వ‌డ్డీ రేటును కాస్త అధికంగానే వ‌సూలు చేస్తాయి.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని