Published : 20 Jun 2022 15:30 IST

వ్య‌క్తిగ‌త రుణాల వ‌డ్డీ రేట్లు ఏ బ్యాంక్‌లో ఎంతెంత?

బ్యాంకులు ఎటువంటి పూచిక‌త్తు లేకుండా వ్య‌క్తిగ‌త రుణం అంద‌చేస్తున్నాయి. వ్య‌క్తిగ‌త రుణం తీసుకునే ముందు కొన్ని ముఖ్య‌మైన‌ విష‌యాలు తెలుసుకోవాలి. వ్య‌క్తిగ‌త రుణాన్ని అసుర‌క్షిత రుణంగా బ్యాంకులు ప‌రిగ‌ణిస్తాయి. వీటికి ఎలాంటి ఆస్తుల‌ను తాక‌ట్టు పెట్ట‌వ‌ల‌సిన అవ‌స‌రం లేదు. అయితే, క్రెడిట్ స్కోర్ 750 అంత‌కంటే దాటి ఉన్న వారికి  లోన్ ఇవ్వ‌డంలో ప్రాధాన్య‌త ఉండ‌ట‌మే కాకుండా వ‌డ్డీ రేట్లు కూడా త‌క్కువ ఉండే అవ‌కాశ‌ముంది.

క్రెడిట్ స్కోర్ త‌క్కువున్న వారికి కూడా కొన్ని రుణ సంస్థ‌లు, ఫిన్‌టెక్‌ సంస్థ‌లు రుణాలు ఇచ్చే అవ‌కాశ‌ముంది, కానీ అధిక వ‌డ్డీ రేట్ల‌ను వ‌సూలు చేస్తాయి. ఈ రుణాలు సంవ‌త్స‌రానికి 8.30% వ‌డ్డీ రేటు నుండి ప్రారంభ‌మ‌వుతున్నాయి. వివిధ అవ‌స‌రాల నిమ్మిత్తం చిన్న చిన్న అప్పులు, ఖ‌ర్చులు ఎక్కువై ఆర్ధిక ఒత్తిడిలో ఉన్న‌పుడు ఈఎమ్ఐల ద్వారా చెల్లించే సౌల‌భ్య‌మున్న వ్య‌క్తిగ‌త రుణాన్ని బ్యాంకుల ద్వారా తీసుకోవ‌డం కాస్త ఉప‌శ‌మ‌నంగా ఉంటుంది.

మీ ప్రొఫైల్ ఆధారంగా ప్రీ-అప్రూవ్డ్ క‌స్ట‌మ‌ర్‌ల‌యితే గంట‌ల్లో రుణం మంజూరు అవ్వొచ్చు. కొంత మందికి అయితే ఒక వారంలోపు వ్య‌క్తిగ‌త రుణం పంపిణీ అవ్వొచ్చు. వ్య‌క్తిగ‌త రుణాల‌ను పొంద‌డానికి జీతం పొందే వ్య‌క్తులకు ఆర్ధిక సంస్థ‌లు అధిక ప్రాధాన్య‌త ఇస్తాయి. రుణ ద‌ర‌ఖాస్తును పూరించి మీ వ్య‌క్తిగ‌త, వృత్తిప‌ర‌మైన, ఆదాయ వివ‌రాల‌ను ధృవీక‌రించే అన్ని సంబంధిత ప‌త్రాల‌ను స‌మ‌ర్పించాలి. ఇప్ప‌టికే ఆ బ్యాంక్‌లో ఖాతా, క్రెడిట్ కార్డు ఉన్నా కూడా మీరు నిర్వ‌హించే ఖాతాలు అన్నిటినీ  పరిశీలించి, చెల్లింపుల హిస్ట‌రీ చూసి బ్యాంకులు రుణాల‌ను ఇవ్వ‌డానికి ఆస‌క్తి చూపుతాయి. అయితే ఇల్లు, కారు రుణాల‌కంటే ఈ వ్య‌క్తిగ‌త రుణాల‌కు వ‌డ్డీ రేటు ఎక్కువ‌. మీ ఆదాయం, తిరిగి చెల్లించే సామ‌ర్ధ్యం ఆధారంగా బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయి.

5 సంవ‌త్స‌రాల కాల‌వ్య‌వ‌ధితో రూ. 2.50 ల‌క్ష‌ల వ్య‌క్తిగ‌త రుణాల‌పై ప్ర‌స్తుతం అతి త‌క్కువ వ‌డ్డీ రేట్ల‌ను అందిస్తున్న బ్యాంకుల `ఈఎమ్ఐ`లు ఇక్క‌డ ఉన్నాయి.

*ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి.

ప్రాసెసింగ్ ఫీజులు, ఇతర ఛార్జీలు `ఈఎమ్ఐ`ల‌లో క‌ల‌ప‌బ‌డ‌లేదు. ప‌ట్టిక‌లో తెలిపిన వ‌డ్డీ, రుణ మొత్తం ఒక‌ సూచిక మాత్ర‌మే. ఇది బ్యాంక్ నిబంధ‌న‌లు, ష‌ర‌తుల‌పై ఆధార‌ప‌డి మార‌వ‌చ్చు. మీ ప‌ర‌ప‌తిని బ‌ట్టి ప‌ట్టిక‌లో ఉన్నట్లుగా రూ. 2.50 ల‌క్ష‌లే కాకుండా ఇంకా అధిక మొత్తంలో కూడా రుణం పొందొచ్చు.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts