Petrol, Diesel Price: ఐదు రోజుల్లో నాలుగో సారి పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

సామాన్యుడిపై పెట్రోల్‌, డీజిల్‌ ధరల వడ్డన కొనసాగుతూనే ఉంది. వరుసగా నాలుగో రోజు చమురు

Updated : 26 Mar 2022 07:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్: సామాన్యుడిపై పెట్రోల్‌, డీజిల్‌ ధరల వడ్డన కొనసాగుతూనే ఉంది. ఐదు రోజుల్లో నాలుగో సారి చమురు సంస్థలు ధరలను పెంచాయి. పెట్రోల్‌పై 89పైసలు, డీజిల్‌పై 86 పైసలు పెరిగాయి. పెంచిన ధరలతో హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ.111.80, డీజిల్‌ రూ.98.10కి చేరింది. విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ రూ.113.60, డీజిల్‌ రూ.99.50కి పెరిగింది. మొత్తంగా ఐదు రోజుల్లో ఇంధన ధరలు లీటర్‌పై రూ. 3.20పైగా పెరిగాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని