Petrol Price: పెట్రోల్‌ ధర.. 4 రోజుల్లో రూ.2.40 పెంపు

దేశంలో చమురు ధరల మోత మోగుతోంది. ఒక రోజు విరామం తర్వాత శుక్రవారం పెట్రోల్‌, డీజిల్‌ ధరలను మరోసారి పెంచాయి చమురు సంస్థలు. లీటర్‌ ధరపై 80 పైసల చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించాయి. దీంతో దేశ రాజధానిలో

Published : 25 Mar 2022 10:18 IST

దిల్లీ: దేశంలో చమురు ధరల మోత మోగుతోంది. ఒక రోజు విరామం తర్వాత శుక్రవారం పెట్రోల్‌, డీజిల్‌ ధరలను మరోసారి పెంచాయి చమురు సంస్థలు. లీటర్‌ ధరపై 80 పైసల చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించాయి. దీంతో దేశ రాజధానిలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.97.81, డీజిల్‌ ధర రూ.88.27కు చేరాయి. కేవలం నాలుగు రోజుల్లోనే పెట్రోల్‌, డీజిల్‌ ధర రూ.2.40 పెరగడం గమనార్హం. 137 రోజుల విరామం తర్వాత మార్చి 22న పెట్రోల్, డీజిల్‌ ధరలను 80 పైసల చొప్పున పెంచిన విషయం తెలిసిందే. మార్చి 23న కూడా ఇదే విధంగా ధరల పెంపు కొనసాగగా.. గురువారం వీటి ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. తాజాగా నేడు మరోసారి పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.

ప్రధాన నగరాల్లో చమురు ధరలు ఇలా ఉన్నాయి..

దిల్లీ: పెట్రోల్‌ రూ.97.81, డీజిల్‌ రూ.89.07

ముంబయి: పెట్రోల్ రూ.112.51, డీజిల్‌ రూ.96.70

చెన్నై: పెట్రోల్‌ రూ.103.67, డీజిల్‌ రూ.93.71

కోల్‌కతా: పెట్రోల్‌ రూ.107.18, డీజిల్ రూ.92.22

హైదరాబాద్‌: పెట్రోల్‌ రూ.110.91, డీజిల్ రూ.97.24

అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగినప్పటికీ.. ఇటీవల చాలా రోజు వరకూ వీటి ధరలను దేశీయ చమురు సంస్థలు సవరించలేదు. దీంతో ప్రభుత్వ రంగ సంస్థలైన ఐఓసీ, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌ కంపెనీలు దాదాపు రూ.19వేల కోట్లు నష్టపోయినట్లు మూడిస్‌ సంస్థ అంచనా వేసింది. ఈ నేపథ్యంలోనే నష్టాలను పూడ్చుకునేందుకు రానున్న రోజుల్లో ధరల పెంపు కొనసాగొచ్చని పేర్కొంది. ఈ నష్టాల్ని అధిగమించేందుకు చమురు సంస్థలు లీటర్ పెట్రోల్‌ ధరను రూ.10.60-22.30, డీజిల్‌ ధరను రూ.13.10-24.90 వరకు పెంచే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు