Petrol Prices: పెట్రో మంట.. 10 రోజుల్లో రూ.6.40 పెంపు..

సామాన్యుడి గుండె గుబేలయ్యేలా దేశంలో ఇంధన ధరల మోత మోగుతోంది. గురువారం కూడా పెట్రోల్‌, డీజిల్‌

Updated : 31 Mar 2022 11:33 IST

హైదరాబాద్‌లో రూ.115 దాటిన పెట్రోల్‌ ధర

దిల్లీ: సామాన్యుడి గుండె జారిపోయేలా దేశంలో ఇంధన ధరల మోత మోగుతోంది. గురువారం కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను 80 పైసల చొప్పున పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయించారు. గత 10 రోజుల్లో 9 సార్లు వీటి ధరలను సవరించగా.. లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.6.40 పెరగడం గమనార్హం. దీంతో దేశ రాజధానిలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.101.81కి చేరింది. ముంబయి, కోల్‌కతాల్లో, హైదరాబాద్‌ల్లో అయితే ఏకంగా రూ.110 దాటేసింది. 

137 రోజుల విరామం తర్వాత మార్చి 22న పెట్రోల్, డీజిల్‌ ధరలను 80 పైసల చొప్పున పెంచిన విషయం తెలిసిందే. నాటి నుంచి ఒక రోజు మినహా దాదాపు ప్రతి రోజూ ధరల పెంపు కొనసాగుతోంది. అటు గ్యాస్‌ ధరలు కూడా పెరగడం, నిత్యావసరాలు మండిపోతుండటంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చమురు ధరల పెంపునకు నిరసనగా కాంగ్రెస్‌ పార్టీ నేటి నుంచి దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. దిల్లీలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ నిరసనల్లో పాల్గొన్నారు.

ప్రధాన నగరాల్లో చమురు ధరలు ఇలా ఉన్నాయి..

దిల్లీ: పెట్రోల్‌ రూ.101.81, డీజిల్‌ రూ.93.07

ముంబయి: పెట్రోల్ రూ.116.72, డీజిల్‌ రూ.100.94

చెన్నై: పెట్రోల్‌ రూ.107.45, డీజిల్‌ రూ.97.52

కోల్‌కతా: పెట్రోల్‌ రూ.111.35, డీజిల్ రూ.96.22

హైదరాబాద్‌: పెట్రోల్‌ రూ.115.42, డీజిల్ రూ.101.58


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని