Petrol, diesel prices: మరోసారి పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

దేశీయ చమురు కంపెనీలు వరుసగా రెండో రోజూ దేశ వ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచాయి. తాజాగా లీటరు పెట్రోల్‌పై 90 పైసలు, డీజిల్‌పై 87 పైసలు

Updated : 23 Mar 2022 10:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశీయ చమురు కంపెనీలు వరుసగా రెండో రోజూ దేశ వ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచాయి. తాజాగా లీటరు పెట్రోల్‌పై 90 పైసలు, డీజిల్‌పై 87 పైసలు పెంచాయి. దీంతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ.110, డీజిల్‌ ధర రూ.96.36కు చేరుకుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో లీటర్‌ పెట్రోల్‌పై 87పైసలు, డీజిల్‌పై 84 పైసలు పెరిగింది. గుంటూరులో లీటర్‌ పెట్రోల్‌ రూ.112.08, డీజిల్‌ రూ.98.10కి చేరుకుంది. నిన్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో పాటు చమురు సంస్థలు వంటగ్యాస్‌ ధరలను పెంచిన విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని