Petrol: హైదరాబాద్‌లో పెట్రోల్‌ @ రూ.100

చమురు ధరల మంట ఇప్పట్లో ఆగేలా కన్పించట్లేదు. దేశీయ ఇంధన తయారీ సంస్థలు పెట్రోల్, డీజిల్‌ ధరలను సోమవారం మరోసారి పెంచాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో

Updated : 14 Jun 2021 14:53 IST

హైదరాబాద్‌: చమురు ధరల మంట ఇప్పట్లో ఆగేలా కన్పించట్లేదు. దేశీయ ఇంధన తయారీ సంస్థలు పెట్రోల్, డీజిల్‌ ధరలను సోమవారం మరోసారి పెంచాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సెంచరీ కొట్టిన పెట్రోల్‌ ధర.. తాజాగా హైదరాబాద్‌లోనూ రూ.100 దాటేసింది. తాజా పెంపుతో నగరంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.100.20కి చేరింది. ఇక డీజిల్‌ ధర కూడా రూ.95 దాటింది.

నేడు పెట్రోల్‌పై 29 పైసలు, డీజిల్‌పై 30 పైసలు పెరిగింది. దీంతో దేశ రాజధాని దిల్లీలో లీటర్‌ పెట్రోల్ ధర రూ.96.41గా ఉంది. ఇక వాణిజ్య రాజధాని ముంబయిలో పెట్రోల్‌ ధర ఇప్పటికే రూ.102 దాటేసిన విషయం తెలిసిందే. స్వల్ప విరామం తర్వాత మే 4 నుంచి ఇంధన ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. సోమవారం నాటికి మొత్తం 24 సార్లు ధరలను పెంచగా.. ఇప్పటివరకు పెట్రోల్‌పై రూ.5.72, డీజిల్‌పై రూ.6.25 పెరిగింది.

రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌ జిల్లాలో లీటర్‌ పెట్రోల్‌ ధర అత్యధికంగా రూ.107.53గా ఉంది. అక్కడ డీజిల్‌ కూడా వంద దాటేసి రూ.100.37కు చేరింది. రాజస్థాన్‌తో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మధ్యప్రదేశ్‌, లద్దాఖ్‌లలో పెట్రోల్‌ ధర సెంచరీ దాటి పరుగులు పెడుతోంది.

దేశంలోని ప్రధాన నగారాల్లో ఇంధన ధరలు(లీటరు చొప్పున) ఇలా.. 

* దిల్లీ: పెట్రోల్‌ రూ.96.41, డీజిల్ రూ.87.28

ముంబయి:  పెట్రోల్‌ రూ.102.58 , డీజిల్ రూ.94.70

కోల్‌కతా: పెట్రోల్‌ రూ.96.34 , డీజిల్ రూ.90.12

చెన్నై: పెట్రోల్‌ రూ.97.69 , డీజిల్ రూ.91.92

* హైదరాబాద్‌: పెట్రోల్‌ రూ.100.20, డీజిల్ రూ.95.14

* విజయవాడ: పెట్రోల్‌ రూ.99.99 , డీజిల్ రూ.95.72

తెలంగాణలో పెట్రోల్‌ ధర ఇలా..

హైదరాబాద్ : రూ.100.20

ఆదిలాబాద్‌ : రూ.102.22

భద్రాద్రి కొత్తగూడెం:  ధర 101.34

జగిత్యాల: 101.07

జనగాం : రూ.100.26

జయశంకర్‌ భూపాలపల్లి : రూ.100.24

జోగులాంబ గద్వాల్‌: రూ.101.84

కామారెడ్డి: రూ.101.17

కరీంనగర్‌: 100.07

ఖమ్మం: రూ.100.25

కొమరంభీం ఆసిఫాబాద్‌: రూ.101.81

మహబూబాబాద్‌: రూ.100.07

మంచిర్యాల: రూ.101.16

మెదక్‌: రూ. 101.20

మేడ్చల్‌ మల్కాజిగిరి: రూ.100.20

మహబూబ్‌నగర్‌: 101.15

నాగర్‌ కర్నూల్‌: 101.66

నల్గొండ: రూ.100.22

నిర్మల్‌:  రూ.101.74

నిజామాబాద్‌: రూ.102.08

పెద్దపల్లి : రూ.100.72

రాజన్న సిరిసిల్ల: 100.70

రంగారెడ్డి: రూ.100.38

సంగారెడ్డి: రూ.101.13

సిద్దిపేట: రూ.100.40

సూర్యాపేట్‌: రూ.100.02

వికారాబాద్‌: రూ.101.24

వనపర్తి: రూ.101.87

యాదాద్రి భువనగిరి: రూ.100.30

వరంగల్‌: రూ.99.74

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని