ఏడాదిలో తొలిసారి ఇంధన ధరల తగ్గింపు

దేశంలో ఇంధన ధరలు బుధవారం స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పడిపోవడంతో దేశీయ చమురు సంస్థలు లీటర్‌ పెట్రోల్‌ 18పైసలు..

Updated : 24 Mar 2021 11:52 IST

దిల్లీ: దేశంలో ఇంధన ధరలు బుధవారం స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పడిపోవడంతో దేశీయ చమురు సంస్థలు లీటర్‌ పెట్రోల్‌ 18పైసలు, డీజిల్‌పై 17 పైసలు తగ్గిస్తూ నిర్ణయించాయి. దీంతో దేశ రాజధాని దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర ఇంతకుముందు రూ.91.17 ఉండగా.. 18పైసలు తగ్గి రూ.90.99కి చేరింది. ఇక డీజిల్‌ ధర రూ.81.47 ఉండగా.. 17 పైసలు తగ్గి రూ.81.30 చేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో బుధవారం లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.97.40, డీజిల్‌ ధర రూ.88.42గా నమోదైంది. ఇక హైదరబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.94.61గా, డీజిల్‌ ధర రూ.88.67గా ఉంది. 

గత కొంత కాలంగా దేశంలో ఇంధన ధరల్లో భారీగా పెరుగుదల నమోదైన విషయం తెలిసిందే. గతేడాది మార్చి 16 తర్వాత దేశంలో పెట్రో ధరలు తగ్గించడం ఇదే తొలిసారి. ఏడాది కాలంలో ముడి చమురు ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ.. దేశంలో పెట్రోల్‌పై రూ.21.58, డీజిల్‌పై రూ.19.18 పెరగడం గమనార్హం. గత నెలలో రాజస్థాన్‌, మహారాష్ట్ర, మద్యప్రదేశ్‌ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో పెట్రోల్‌ ధరలు రూ.100 మార్కును చేరుకున్న విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు