Phonepe: డెబిట్ కార్డు లేకపోయినా UPI.. ఫోన్‌పేలో కొత్త సదుపాయం
కేవలం బ్యాంకు ఖాతా మాత్రమే కలిగి ఉండి డెబిట్ కార్డు లేని వారి కోసం ఫోన్‌పే (phonepe) కొత్త సదుపాయం తీసుకొచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో జరిగే డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐ (UPI)దే అగ్రస్థానం. ఇప్పటికే చాలా మంది థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా ఈ సేవలను పొందుతున్నారు. అయితే, UPIని యాక్టివేట్ చేసుకునే క్రమంలో పిన్ సెట్ చేసుకోవాలంటే డెబిట్ కార్డు తప్పనిసరి. ఆ వివరాలు ఉంటేనే యూపీఐని యాక్టివేట్ చేసుకుని బ్యాంక్ లావాదేవీలు జరిపే వీలుంది. మరి కేవలం బ్యాంకు ఖాతా మాత్రమే కలిగి ఉండి డెబిట్ కార్డు లేకపోతే? ఇలాంటి వారి కోసమే ఫోన్‌పే (phonepe) కొత్త సదుపాయం తీసుకొచ్చింది. ఆధార్ కార్డు వివరాల ద్వారా యూపీఐకు రిజిస్టర్ అయ్యే సదుపాయం తీసుకొచ్చింది. ఈ తరహా సేవలందిస్తున్న తొలి కంపెనీ తమదేనని తెలిపింది.
సాధారణంగా ఫోన్‌పే (Phonepe) వంటి యాప్స్‌లో UPI సేవలు వాడాలంటే డెబిట్ కార్డు వివరాలు ఉంటేనే UPI పిన్ సెట్ చేసుకోవడానికి వీలు పడుతుంది. అయితే, డెబిట్ కార్డు లేని వారు ఆధార్ వివరాలు ఉపయోగించి UPI లావాదేవీలు చేయొచ్చు. ఆధార్‌లోని చివరి ఆరు అంకెలను ఉయోగించి బ్యాంకు ఖాతాను జత చేసుకోవచ్చు. ఆధార్ వివరాలు ఎంటర్ చేసినప్పుడు ఆధార్‌తో లింకైన ఫోన్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. అనంతరం ఆధార్‌తో లింకైన బ్యాంకును యూపీఐకు అనుసంధానం చేసుకుని పిన్ నంబర్ సెట్ చేసుకోవాల్సి ఉంటుందని ఫోన్‌పే ఓ ప్రకటనలో తెలిపింది.
ఆధార్ వివరాలతో ఫోన్‌పేలో UPI యాక్టివేట్ చేసుకున్నాక.. సాధారణ ఖాతా మాదిరిగానే నగదు బదిలీ, బ్యాలెన్స్ తనిఖీ వంటి పనులు చేసుకోవవచ్చు. దీనివల్ల యూపీఐ విధానం మరింత మందికి చేరువవ్వడంతో పాటు, కొత్త కస్టమర్లు ఫోన్‌పేలో భాగస్వాములు అవ్వడానికి వీలు పడుతుందని కంపెనీ పేమెంట్ హెడ్ దీప్ అగర్వాల్ పేర్కొన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (31/01/2023)
-
World News
Meta: మేనేజర్ వ్యవస్థపై జూకర్బర్గ్ అసంతృప్తి.. మరిన్ని లేఆఫ్‌లకు సంకేతాలు..?
-
India News
Noida: పాత కార్లపై నజర్.. ఫిబ్రవరి 1 నుంచి 1.19లక్షల కార్లు సీజ్
-
Movies News
Pathaan: పఠాన్‌కు వెన్నెముక ఆయనే: షారుక్ ఖాన్
-
General News
Bengaluru: బెంగళూరుకు గులాబీ శోభ.. నగరంలో కొత్త అందాల ఫొటోలు చూశారా?
-
World News
Viral News: ఒక్కో ఉద్యోగికి ₹6 కోట్లు బోనస్.. కట్టలుకట్టలుగా పంచిన చైనా కంపెనీ!