PhonePe: ఫోన్‌పే రూ.2,847 కోట్ల సమీకరణ

మౌలిక వసతులను మరింత విస్తరించుకోవాలని ఫోన్‌పే (PhonePe) ప్రణాళికలు రచిస్తోంది. అందుకోసం నిధుల సమీకరణ ప్రక్రియను ప్రారంభించింది.

Published : 19 Jan 2023 14:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వాల్‌మార్ట్‌ నేతృత్వంలోని ఫిన్‌టెక్‌ సంస్థ ఫోన్‌పే (PhonePe) 350 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.2,847 కోట్లు) సమీకరించింది. 12 బిలియన్ డాలర్ల కంపెనీ విలువ వద్ద జనరల్‌ అట్లాంటిక్‌ ఈ పెట్టుబడులను సమకూర్చేందుకు ముందుకు వచ్చింది. ఈ నెలలో మొత్తం 1 బిలియన్‌ డాలర్లు సమీకరించాలని ఫోన్‌పే (PhonePe) లక్ష్యంగా పెట్టుకుంది.

ఫోన్‌పే (PhonePe) ఇటీవలే ఫ్లిప్‌కార్ట్‌ నుంచి పూర్తిగా వేరుపడింది. అలాగే సింగపూర్‌ నుంచి ప్రధాన కార్యాలయాన్ని భారత్‌కు తరలించింది. ఫలితంగా పూర్తి స్థాయి దేశీయ సంస్థగా అవతరించింది. తాజాగా సమీకరించే నిధులతో మౌలిక వసతులను ఏర్పాటు చేసుకోవాలని ఫోన్‌పే (PhonePe) ప్రణాళికలు రచిస్తోంది. డేటా సెంటర్ల నిర్మాణం, ఆర్థిక సేవల విస్తరణ, ఇన్సూరెన్స్‌, వెల్త్‌ మేనేజ్‌మెంట్‌, రుణ వితరణ వంటి వ్యాపారాల ప్రారంభానికి ఈ నిధులను వెచ్చించనున్నట్లు సమాచారం.

2015 డిసెంబరులో ఫోన్‌పే (PhonePe) ప్రారంభమైంది. తాజా నిధులతో  డిజిటల్‌ చెల్లింపులు ఊపందుకునేలా చర్యలు తీసుకుంటామని కంపెనీ తెలిపింది. తద్వారా డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థలో మరింత మందిని మిళితం చేసేందుకు కృషి చేస్తున్నామని పేర్కొంది. ప్రస్తుతం 400 మిలియన్‌ యూజర్లు ఫోన్‌పే (PhonePe)లో రిజిస్టర్‌ అయ్యారు. అంటే ప్రతి నలుగురు భారతీయుల్లో ఒకరు ఫోన్‌పే (PhonePe) సేవల్ని వినియోగించుకుంటున్నారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు