Phonpe: ఫోన్‌పే కొత్త మైలురాయి.. 1 ట్రిలియన్‌ డాలర్లకు పేమెంట్ల విలువ

Phonpe payments: ఫోన్‌పే కొత్త మైలురాయిని అందుకుంది. తొలిసారి పేమెంట్ల వార్షిక విలువ రూ.84 లక్షల కోట్లకు చేరింది.

Published : 11 Mar 2023 16:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యూపీఐ వాడే వారిందరికీ ఫోన్‌పే (Phonepe) సుపరిచితమే. ఎక్కువ మంది వినియోగించే యూపీఐ యాప్స్‌లో ఇదీ ఒకటి. ఇప్పుడీ డిజిటల్‌ పేమెంట్‌ ప్లాట్‌ఫాం కొత్త మైలురాయిని చేరుకుంది. ఈ ప్లాట్‌ఫామ్‌ ద్వారా జరిగే వార్షిక పేమెంట్ల విలువ 1 ట్రిలియన్‌ డాలర్లకు (రూ.84 లక్షల కోట్లు) చేరుకున్నట్లు ఆ కంపెనీ తెలిపింది. యూపీఐ లావాదేవీల కారణంగానే ఈ మైలురాయిని అందుకోగలిగినట్లు ఓ ప్రకటనలో పేర్కొంది.

2, 3, 4 టైర్‌ నగరాలతో పాటు, దేశంలోని 99 శాతం పిన్‌కోడ్లలో మూడున్నర కోట్ల మంది ఆఫ్‌లైన్‌ మర్చంట్స్‌ ద్వారా తాము సేవలందిస్తున్నామని కంపెనీ తెలిపింది. యూపీఐ చెల్లింపుల వ్యవస్థలో 50 శాతానికి పైగా మార్కెట్‌ వాటా కలిగి ఉన్నామని తెలిపింది.  తదుపరి దశలో యూపీఐ లైట్‌, యూపీఐ ఇంటర్నేషనల్‌, క్రెడిట్‌ ఆన్‌ యూపీఐ వంటి సేవల ద్వారా మరింత వేగంగా రాణించేందుకు కృషి చేస్తామని ఫోన్‌పే కన్జ్యూమర్‌ బిజినెస్‌ హెడ్‌ సోనికా చంద్ర ఓ ప్రకటనలో తెలిపారు. ఆర్‌బీఐ నుంచి పేమెంట్‌ అగ్రిగేటర్‌ లైసెన్స్‌ సైతం పొందినట్లు పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని