Pizza: పిజ్జా తయారీ, అమ్మకంపై వేరువేరు జీఎస్టీ.. పెరగనున్న ధరలు..?

అయితే సాధారణంగా పిజ్జాల తయారీ, అమ్మకంపై ఒక్కోరకంగా పన్ను రేట్లు(GST) ఉంటాయి. పిజ్జాతో పోలిస్తే పిజ్జా టాపింగ్‌ వేరని, దీనిపై 18 శాతం పన్ను విధించవచ్చని హరియాణా అప్పిలేట్‌ ఫర్‌ అడ్వాన్స్‌ రూలింగ్‌(AAAR) బెంచ్‌ తాజాగా ఇచ్చిన తీర్పులో పేర్కొంది. 

Updated : 16 Mar 2022 02:50 IST

దిల్లీ: ఇటాలియన్‌ వంటకమైన పిజ్జా.. భారతీయులకు సైతం ఇప్పుడు ఇదో ప్రీతికరమైన ఆహారంగా మారిపోయింది. ఫ్యాటీ చీజ్, రిచ్ మీట్, స్వీట్ సాస్ టాపింగ్‌ పిజ్జాలను భారతీయులు ఇష్టంగా తింటారు. అయితే సాధారణంగా పిజ్జాల తయారీ, అమ్మకంపై ఒక్కోరకంగా పన్ను రేట్లు(GST) ఉంటాయి. పిజ్జాతో పోలిస్తే పిజ్జా టాపింగ్‌ వేరని, దీనిపై 18 శాతం పన్ను విధించవచ్చని హరియాణా అప్పిలేట్‌ ఫర్‌ అడ్వాన్స్‌ రూలింగ్‌(AAAR) బెంచ్‌ తాజాగా ఇచ్చిన తీర్పులో పేర్కొంది.  

తయారీ, విక్రయాన్ని బట్టి పిజ్జాలపై జీఎస్టీ రేట్లను లెక్కగడతారు. పిజ్జాను రెస్టారెంట్‌లోనే తింటే 5శాతం జీఎస్టీ, అదే హోం డెలివరీ అయితే 18శాతం జీఎస్టీ, విడిగా కొనుగోలు చేసే పిజ్జా బేస్‌పై 12 శాతం జీఎస్టీ రేటు విధిస్తారు. పిజ్జా టాపింగ్‌ను సాధారణ పిజ్జాతో పోల్చకూడదని.. పిజ్జా టాపింగ్‌పై తప్పనిసరిగా 18 శాతం జీఎస్టీ విధించాలని పేర్కొంది. సాధారణ పిజ్జాతో పోలిస్తే పిజ్జా టాపింగ్‌ తయారీ విధానం వేరుగా ఉంటుందని, దీనిలో అనేక రకాల పదార్థాలు వాడతారని అందుకే దానిపై 18 శాతం జీఎస్టీ విధించాలని పేర్కొంది. ఈ సంక్లిష్ట పన్ను విధానాల కారణంగా పిజ్జాల ధరల పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ అంశంపై పిజ్జా బ్రాండ్లు ఇంకా స్పందించలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని