Boeing: బోయింగ్‌లోనూ కోతలు.. 2000 మంది సిబ్బందిపై వేటు!
ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్ (Boeing) తన ఉద్యోగుల్లో కోత విధించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈఏడాది దాదాపు 2000 మందిని తొలగించి వారిస్థానంలో పొరుగుసేవలను (Outsourcing) వినియోగించుకోవాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం.
ఇంటర్నెట్‌డెస్క్: మైక్రోసాఫ్ట్ (Microsoft), గూగుల్ (Google) లాంటి అంతర్జాతీయ టెక్ కంపెనీలు ఓ వైపు లేఆఫ్‌లు విధిస్తూ.. మరోవైపు సిబ్బందిని తగ్గించుకుంటున్న తరుణంలో అమెరికాకు చెందిన ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్ (Boeing)కూడా అదే బాటలో పయనిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు 2000మందిని ఉద్యోగం నుంచి తొలగించి, వారి స్థానంలో ఔట్ సోర్సింగ్ (Outsourcing) ఉద్యోగులను (Employees) నియమించుకోవాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈమేరకు ఒక అంతర్జాతీయ వార్తా సంస్థ కథనం వెలువరించింది. ఇంజినీరింగ్, తయారీ విభాగంలో దృష్టి సారించనున్నట్లు చెబుతున్న బోయింగ్..ఫైనాన్స్, హెచ్‌ఆర్ విభాగంలో ఉద్యోగులను తగ్గించుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
మూడొంతుల్లో ఒకవంతు ఉద్యోగాలను పొరుగు సేవలపై టీసీఎస్‌కు అప్పగించనుంది. ఉత్పత్తి, సర్వీసులు, టెక్నాలజీ అభివృద్ధిపై దృష్టి సారించే క్రమంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోందని, కొన్ని విభాగాల్లో సిబ్బందిని తగ్గించుకోవాలని అనుకుంటున్నామని, ఈ లోటును భర్తీ చేసేందుకు పొరుగుసేవలను ఆశ్రయించనున్నామని బోయింగ్ సంస్థ అంతర్జాతీయ మీడియా సంస్థకు తెలిపింది. అయితే ఎంతమందిని తొలగిస్తామన్న విషయం మాత్రం స్పష్టంగా చెప్పలేదు. అయితే ఇంజినీరింగ్, తయారీ (మ్యానుఫ్యాక్చరింగ్) విభాగంలో మరింత మంది సిబ్బందిని నియమించుకుంటామని బోయింగ్ వెల్లడించింది. గతేడాది దాదాపు 15000 మందిని ఉద్యోగులను నియమించుకున్నట్లు చెప్పిన బోయింగ్.. ఈ సంవత్సరంలో మరో 10,000 మందిని రిక్రూట్ చేసుకుంటామని తెలిపింది.
మరోవైపు గతంలో జరిగిన ప్రమాదాల నేపథ్యంలోనే బోయింగ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2018 అక్టోబరులో లైయన్ ఎయిన్ ఫ్లైట్ 610 టేకాఫ్ అయిన 13 నిమిషాలకే జావా సముద్రంలో కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 189 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. 2019లో జరిగిన మరో ఘటనలో ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 మ్యాక్స్ విమానం టేకాఫ్ ఆయిన ఆరు నిమిషాలకే క్రాష్ అయ్యింది. ఈ ఘటనలో 157 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ రెండు భారీ సంఘటనలు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. విమాన తయారీలో లోపం వల్లనే ఈ ప్రమాదాలు జరిగినట్లు నిర్ధరణ అయ్యింది. ప్రధానంగా ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ సాఫ్ట్‌వేర్‌లో లోపం కొట్టుకొచ్చినట్లు కనిపించింది. ఈ నేపథ్యంలోనే తయారీపై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టిన బోయింగ్.. ఇతర విభాగాల్లో సిబ్బందిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Espionage: రష్యాలో అమెరికన్ జర్నలిస్టు అరెస్టు.. ప్రచ్ఛన్న యుద్ధానంతరం మొదటిసారి!
-
World News
African:ఆఫ్రికాలో కొత్త వైరస్.. ముక్కు నుంచి రక్తస్రావమైన 24 గంటల్లోనే ముగ్గురి మృతి
-
Sports News
IPL 2023: ‘ఈ సీజన్లో ఛాంపియన్‌గా నిలిచేది ఆ జట్టే’.. ముంబయి, చెన్నైలకు నో ఛాన్స్!
-
Movies News
Rana Naidu: ‘రానా నాయుడు’.. తెలుగు ఆడియో డిలీట్.. కారణమదేనా?
-
Politics News
Congress: మంత్రి కేటీఆర్, బండి సంజయ్ ట్వీట్లకు తెలంగాణ కాంగ్రెస్ కౌంటర్
-
Crime News
Robbery: సినిమాలో చూసి.. రూ.47 లక్షలు కాజేసి..!