పీఎం కిసాన్‌ eKYC గడువు పొడిగింపు.. కేవైసీ ఇంకా చేయలేదా?

PM Kisan eKYC: పీఎం కిసాన్‌ ఇ-కేవేసీ గడువును కేంద్రం ఆగస్టు 31 వరకు పొడిగించింది.

Published : 18 Aug 2022 17:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశవ్యాప్తంగా ఉన్న రైతుల‌కు ప్రయోజనం చేకూర్చేందుకు కేంద్రం అమ‌లు చేస్తున్న ప‌థ‌కం పీఎం కిసాన్‌ (PM kisan). రైతుల‌కు పెట్టుబ‌డి సాయం అందించాల‌నే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఏడాదికి మూడు దఫాల్లో రూ.2 వేలు చొప్పున మొత్తం రూ.6వేలు రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. ఈ నగదు జమ అవ్వాలంటే రైతులు eKYC చేసుకోవడం తప్పనిసరి. ఇప్పటికే 11 విడతల్లో రూ.2 వేలు చొప్పున కేంద్రం విడుదల చేసింది. 12వ విడత సెప్టెంబర్‌లో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ మొత్తం పొందాలంటే రైతులు eKYC పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తికి జులై 31 వరకు గడువు ఉండగా.. ఇంకా కొంతమంది రైతులు eKYC పూర్తి చేయని కారణంగా ఆగస్టు 31 వరకు గడువు పొడిగించారు. ఒకవేళ ఇప్పటి వరకు eKYC పూర్తి చేయకపోతే ఆన్‌లైన్‌లో సులువుగా చేసుకోండి..

పీఎం-కిసాన్ ఇ-కేవైసీ ఎలా పూర్తి చేయాలి?

  • పీఎం-కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌ని సంద‌ర్శించండి https://pmkisan.gov.in/
  • సైట్ కుడి వైపున అందుబాటులో ఉన్న eKYCపై క్లిక్ చేయండి.
  • ఆధార్ కార్డు నంబ‌ర్‌, CAPCHA కోడ్‌ను నమోదు చేసి సెర్చ్‌పై క్లిక్‌ చేయండి.
  • ఆధార్ కార్డుతో లింక్ చేసిన మొబైల్ నంబ‌ర్‌ను న‌మోదు చేయండి.
  • GET OTPపై క్లిక్ చేసి, పేర్కొన్న ఫీల్డ్‌లో OTPని న‌మోదు చేయండి.
  • అన్ని వివ‌రాలూ స‌రిపోలితే.. eKYC ప్రక్రియ పూర్తవుతుంది. లేకుంటే అది చెల్లనిదిగా కనిపిస్తుంది. అటువంటి సంద‌ర్భాల్లో మీరు స్థానిక ఆధార్ సేవా కేంద్రాన్ని సంప్రదించాలి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని