భారత ఆర్థిక రంగంపై చెరగని ముద్ర.. రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా మృతిపట్ల ప్రముఖుల సంతాపం

వాణిజ్య దిగ్గజం, స్టాక్‌మార్కెట్‌ గురూ రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా హఠాన్మరణంపై దేశ ప్రధాని నరేంద్ర  మోదీ సహా ప్రముఖులు స్పందించారు. ప్రధాని మోదీ తన సంతాప సందేశంలో రాకేశ్ దేశ ప్రగతికి చేసిన కృషిని గుర్తుకు తెచ్చుకొన్నారు.

Updated : 14 Aug 2022 11:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వాణిజ్య దిగ్గజం, స్టాక్‌మార్కెట్‌ గురు రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా హఠాన్మరణంపై దేశ ప్రధాని నరేంద్ర  మోదీ సహా ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ తన సంతాప సందేశంలో.. రాకేశ్ దేశ ప్రగతికి చేసిన కృషిని గుర్తు చేశారు. ‘‘రాకేశ్‌ మొండి పట్టుదలగల మనిషి. ఆయన జీవితం మొత్తం సరదాతోపాటు మేధస్సుతోనూ గడిపారు. ఆయన ఆర్థిక రంగంపై చెరగని ముద్ర వేశారు. దేశ పురోగతిని కాంక్షించారు. ఆయన మరణం చాలా విచారకరం. ఆయన కుటుంబ సభ్యులు, మిత్రులకు సానుభూతి తెలియజేస్తున్నాను. ఓంశాంతి’’ అని ట్వీట్‌ చేశారు.

* ‘వేల మంది సంపద సృష్టించేందుకు ఆయనే స్ఫూర్తి’-వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌

* ‘భారత క్యాపిటల్‌ మార్కెట్లకు ఝున్‌ఝున్‌వాలా సేవలు వెలకట్టలేనివి. స్ఫూర్తిమంతమైన చరిత్రను భావితరాలకు ఆయన వదిలి వెళ్లారు’- తెదేపా అధినేత  చంద్రబాబు నాయుడు

* ‘మిత్రుడి మరణం నా హృదయాన్ని ముక్కలు చేసింది. స్టాక్‌ మార్కెట్లపై ప్రజలకు అవగాహన తెచ్చిన వ్యక్తిగా రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా ఎప్పటికీ గుర్తుండిపోతారు’- వేదాంత రిసోర్స్‌ ఛైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌

*‘ రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా మరణం తీరని లోటు. భారత పరిశ్రామిక రంగం, ఆర్థిక అభివృద్ధికి ఆయన చేసిన కృషి ఎన్నటికీ మరువలేం’’-  మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌

*‘స్టాక్‌ బ్రోకింగ్‌ ప్రపంచంపై ఆయన చెరగని ముద్రవేశారు. కొన్ని తరాల వరకు యువ ఇన్వెస్టర్లకు ఆయన స్ఫూర్తిగా నిలుస్తారు’-అస్సోం ముఖ్యమంత్రి హేమంత్‌ బిశ్వ శర్మ

* ‘ భారత్‌ విషయంలో ఎప్పుడూ నమ్మకం ఉంచిన వ్యక్తి రాకేశ్‌ఝున్‌ఝున్‌వాలా. ఆయన స్టాక్‌ మార్కెట్‌కు చేసిన సేవలు నిరుపమానం. ఆయన మరణం ఫైనాన్షియల్‌ మార్కెట్లకు తీరని లోటు’-కేంద్ర మంత్రి దేవేంద్ర్‌ ప్రధాన్‌







Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని