5G services: ప్రధాని చేతుల మీదుగా రేపు 5జీ సేవలు ప్రారంభం

5G services: దేశంలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 5జీ సేవలు అందుబాటులోకి వచ్చే సమయం ఆసన్నమైంది. అక్టోబర్‌ 1న ప్రధాని నరేంద్రమోదీ చేతులు మీదుగా ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. 

Published : 30 Sep 2022 15:24 IST

దిల్లీ: దేశంలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 5జీ సేవలు అందుబాటులోకి వచ్చే సమయం ఆసన్నమైంది. శనివారం (అక్టోబర్‌ 1) ప్రధాని నరేంద్రమోదీ చేతులు మీదుగా ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. ఎంపిక చేసిన నగరాల్లో తొలుత ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. దశలవారీగా దేశవ్యాప్తంగా ఈ సేవలు విస్తరించనున్నాయి. దిల్లీలోని ప్రగతి మైదాన్‌లో నిర్వహించే ఆరో విడత ఇండియన్‌ మొబైల్‌ కాంగ్రెస్‌, 2022 సదస్సు ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఉదయం 10 గంటలకు 5జీ సేవలను ప్రారంభిస్తారని అధికారిక ప్రకటన వెలువడింది. అయితే, ఏయే నగరాల్లో ప్రారంభంలోకి వచ్చేదీ  వెల్లడి కాలేదు.

అల్ట్రా హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ సేవలతో పాటు కొత్త అవకాశాలు, ప్రయోజనాలు 5జీ ద్వారా లభించనున్నాయి. 4జీతో పోలిస్తే అత్యంత వేగవంతమైన డేటా సేవలు 5జీ ద్వారా లభించనున్నాయి. ఫుల్ లెంగ్త్‌ హై క్వాలిటీ వీడియో లేదా సినిమాను కొన్ని సెకన్ల వ్యవధిలోనే డౌన్‌లోడ్‌ చేసుకోవడం వీలవుతుంది. ఇటీవల నిర్వహించిన వేలం ప్రక్రియలో ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని జియో రూ.88,078 కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌ను దక్కించుకుంది. సునీల్‌ మిత్తల్‌ నేతృత్వంలోని ఎయిర్‌టెల్‌ రూ.43,084 కోట్లు, వొడాఫోన్‌ ఐడియా రూ.18,799 కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేశాయి. అక్టోబర్‌లోనే 5జీ సేవలు తీసుకొస్తామని ఇప్పటికే జియో, ఎయిర్‌టెల్‌ సంస్థలు ప్రకటించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు