Fixed Deposits: పీఎన్‌బీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో మరో రెండు కొత్త కాలపరిమితులు

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ తమ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో మరో రెండు కొత్త కాలపరిమితులను జత చేసింది....

Published : 19 Aug 2022 11:56 IST

దిల్లీ: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ తమ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో మరో రెండు కొత్త కాల పరిమితులను జత చేసింది. రూ.రెండు కోట్ల కంటే తక్కువ మొత్తం డిపాజిట్‌ చేసేవారికి మాత్రమే ఈ రెండు కాల పరిమితులు అందుబాటులో ఉంటాయి. కొత్తగా తీసుకొచ్చిన 405 రోజుల ఎఫ్‌డీకి 6.10 శాతం వడ్డీరేటుగా నిర్ణయించారు. అలాగే 406 రోజుల నుంచి రెండేళ్ల వరకు కాలపరిమితి గల డిపాజిట్‌లకు 5.50 శాతం వడ్డీరేటు ఇవ్వనున్నారు. 2022 ఆగస్టు 19 నుంచి ఈ కొత్త కాలపరిమితులు అమల్లోకి రానున్నట్లు బ్యాంకు తెలిపింది.

ఆగస్టు 17న పీఎన్‌బీ కొన్ని ఎంపిక చేసిన కాలపరిమితులు కలిగిన ఎఫ్‌డీలపై వడ్డీరేట్లను 20 బేసిస్‌ పాయింట్ల వరకు పెంచింది. మూడేళ్ల నుంచి ఐదేళ్ల గడువు ఉన్న డిపాజిట్లపై వడ్డీరేటు యథావిధిగా 5.75 శాతంగా కొనసాగనుంది. ఐదు నుంచి పదేళ్ల కాలపరిమితితో ఉన్న ఎఫ్‌డీలకు 5.65 శాతం వడ్డీ లభించనుంది. సీనియర్‌ సిటిజన్లకు అన్ని కాలపరిమితుల డిపాజిట్లపై ఎప్పటిలాగే 50 బేసిస్‌ పాయింట్ల అదనపు వడ్డీ ఉంటుందని బ్యాంకు స్పష్టం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు