
Adar Poonawalla: ‘నిర్ణయాలు తీసుకోవడంలో వేగం తగ్గింది’.. ప్రభుత్వంపై సీరమ్ బాస్ కీలక వ్యాఖ్యలు!
ముంబయి: కొవిడ్ నుంచి రక్షణ కోసం బూస్టర్ డోసు ఇచ్చే వ్యవధిని 9 నుంచి 6 నెలలకు తగ్గించడం సహా, చిన్నారులకు వ్యాక్సిన్ అందించే విషయంలో ప్రభుత్వం త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) సీఈఓ అదర్ పూనావాలా (Adar Poonawalla) వ్యాఖ్యానించారు. ప్రజల ప్రాణానికి సంబంధించిన ఈ విషయంలో వేగంగా స్పందించాల్సిన చోట నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరుగుతోందని ఆరోపించారు. ఈ మేరకు టైమ్స్ నెట్వర్క్ నిర్వహించిన కాన్క్లేవ్లో ఆయన మాట్లాడారు.
కొవిడ్ వ్యాక్సిన్లను రెండు డోసులు తీసుకున్న వారికి బూస్టర్ డోసు ఇచ్చేందుకు ప్రస్తుతం 9 నెలల వ్యవధిని అనుసరిస్తున్నారు. ఈ గడువును 6 నెలలకు తగ్గించాలని మొదటి నుంచీ కోరుతున్న అదర్ పూనావాలా గడువు తగ్గించాలని మరోసారి ప్రభుత్వాన్ని కోరారు. తానేదో డబ్బుల కోసం ఇలా అడగడం లేదని చెప్పారు. డబ్బుల కోసమే అయితే.. వ్యాక్సిన్ల వేస్టేజీని తగ్గించడానికి ఉచితంగా వాటిని పంపిణీ చేసేవాడినే కాదని వ్యాఖ్యానించారు. కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన వ్యక్తులు గానీ, కమిటీలు గానీ అంత అత్యవసరం కాదన్న రీతిలో వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. నిర్ణయాలు తీసుకోవడంలో మునుపటి వేగం తగ్గిందని వ్యాఖ్యానించారు. వ్యాక్సిన్ డోసు ధరను రూ.600 నుంచి రూ.225కి తగ్గించినా వ్యాక్సిన్ తీసుకోవడంలో ప్రజలు అలసత్వం ప్రదర్శిస్తున్నారని అన్నారు. డిసెంబర్ నుంచి తమ కంపెనీ వ్యాక్సిన్ల ఉత్పత్తిని నిలిపి వేసిందని చెప్పారు.
బూస్టర్ డోసు ప్రక్రియను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని పూనావాలా అన్నారు. చాలా దేశాలు తమ దేశాలకు రాకపోకలకు బూస్టర్ డోసును తప్పనిసరి చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాబట్టి అంతర్జాతీయ ప్రయాణాలు చేసేవారు బూస్టర్ డోసు తీసుకోవాల్సి ఉందన్నారు. డోసుల మధ్య వ్యవధి పెరుగుతున్న కొద్దీ యాంటీబాడీల తగ్గుతున్నట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయని పేర్కొన్నారు. కాబట్టి బూస్టర్ డోసు వ్యవధిని 6 నెలలకు తగ్గించాలని కోరారు. 7-11 ఏళ్ల వయసు వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు కోవోవ్యాక్స్‌కు నియంత్రణ సంస్థల నుంచి అనుమతి వచ్చిందని, ప్రభుత్వ ఆమోదం కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు. ఆరోగ్య సంరక్షణ ప్రాధాన్యాన్ని ప్రభుత్వం గుర్తించినప్పటికీ.. అత్యవసరంగా నిర్ణయాలు తీసుకోవాలన్న విషయాన్ని మాత్రం ప్రభుత్వం మరిచిపోయిందని విమర్శలు చేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Margani Bharat Ram: ఎంపీ సెల్‌ఫోన్ మిస్సింగ్‌పై వివాదం
-
Ap-top-news News
Andhra News: ప్రభుత్వ బడిలో ఐఏఎస్ పిల్లలు
-
Ts-top-news News
Heavy Rains: నేడు, రేపు అతి భారీ వర్షాలు
-
Ap-top-news News
Dadisetti Raja: నచ్చకపోతే వాలంటీర్లను తీసేయండి: మంత్రి రాజా
-
Ap-top-news News
Andhra News: వైకాపాకు ఓటేసి తప్పు చేశాం.. చెప్పులతో కొట్టుకుంటూ నిరసన
-
Movies News
Gautham Raju: ప్రముఖ సినీ ఎడిటర్ గౌతమ్ రాజు కన్నుమూత
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- RRR: ‘ఆర్ఆర్ఆర్.. గే లవ్ స్టోరీ’.. రసూల్ కామెంట్‌పై శోభు యార్లగడ్డ ఫైర్
- IND vs ENG: టీమ్ఇండియా ఓటమిపై రాహుల్ ద్రవిడ్ ఏమన్నాడంటే?
- ఒకటే గొప్పనుకుంటే.. ఆరు చోట్ల సాధించింది!
- Andhra News: మేకప్ వేసి.. మోసం చేసి.. ముగ్గురిని వివాహమాడి..
- Chennai: ‘ఓటీపీ’ వివాదం.. టెకీపై ఓలా డ్రైవర్ పిడిగుద్దులు.. ఆపై హత్య
- Kaali: ముదురుతున్న ‘కాళీ’ వివాదం.. దర్శకురాలు, నిర్మాతలపై కేసులు
- Gautham Raju: ప్రముఖ సినీ ఎడిటర్ గౌతమ్ రాజు కన్నుమూత
- రూ.19 వేల కోట్ల కోత
- Regina Cassandra: ఆ విషయంలో చిరంజీవిని మెచ్చుకోవాల్సిందే: రెజీనా
- బడి మాయమైంది!