BHEL: రూ.7 వేల కోట్ల పవర్‌ ప్లాంట్స్‌ ఆర్డర్లను చేజిక్కుంచుకున్న భెల్‌

భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ (బీహెచ్‌ఈఎల్‌) రూ.7 వేల కోట్ల విలువైన రెండు పవర్‌ ప్లాంట్ల ఆర్డర్లను అదానీ గ్రూప్‌ నుంచి పొందింది.

Published : 14 Jun 2024 18:55 IST

దిల్లీ: అదానీ గ్రూప్‌ నుంచి రూ.7 వేల కోట్ల విలువైన రెండు పవర్‌ ప్లాంట్ల ఆర్డర్లను పొందినట్లు ప్రభుత్వ యాజమాన్యంలోని బీహెచ్‌ఈఎల్‌ శుక్రవారం తెలిపింది. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌ జిల్లాలో ఏర్పాటు చేస్తున్న 2x800 మెగావాట్ల రాయ్‌పూర్‌ సూపర్‌క్రిటికల్‌ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌కు సంబంధించిన మొదటి ఆర్డర్‌ అదానీ పవర్‌ లిమిటెడ్‌ నుంచి అందినట్లు బీహెచ్‌ఈఎల్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌ జిల్లాలో ఏర్పాటు చేస్తున్న 2x800 మెగావాట్ల మీర్జాపూర్‌ సూపర్‌క్రిటికల్‌ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌కు సంబంధించి రెండో ఆర్డర్‌ను MTEUPPL (అదానీ పవర్‌ లిమిటెడ్‌కు సంబంధించిన అనుబంధ సంస్థ) నుంచి పొందినట్లు తెలిపింది. రెండు ప్రాజెక్ట్‌ల కోసం.. స్టీమ్‌ జనరేటర్లు, స్టీమ్‌ టర్బైన్లు, జనరేటర్లతో సహా ప్రాజెక్టులకు సంబంధించిన కీలక పరికరాలను బీహెచ్‌ఈఎల్‌ కంపెనీ తిరుచ్చి, హరిద్వార్‌ ప్లాంట్లలో తయారుచేస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని