
PPF: పీపీఎఫ్ ఖాతా ఎక్కడ, ఎలా తెరవొచ్చు?.. పూర్తి వివరాలు తెలుసుకోండి
ఇంటర్నెట్ డెస్క్: పీపీఎఫ్ ఖాతాను తెరవాలని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే. పీపీఎఫ్ ఖాతాను ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్‌లో తెరవొచ్చు. ఆన్‌లైన్‌లో ఖాతా తెరవాలనుకుంటున్నవారు ఎంపిక చేసుకున్న బ్యాంకు లేదా పోస్టాఫీసు వెబ్‌సైట్ ద్వారా ఖాతాను తెరవొచ్చు. ఆఫ్‌లైన్‌లో ఖాతా తెరవాలనుకుంటే దగ్గర్లోని పోస్టాఫీసు లేదా ఎంపిక చేసుకున్న బ్యాంకుకు వెళ్లి పీపీఎఫ్ ఖాతా దరఖాస్తు ఫారం నింపి కావాల్సిన పత్రాలతో పాటు.. సంబంధిత అధికారికి ఇవ్వాలి. పీపీఎఫ్ ఖాతాను అన్ని బ్యాంకులూ అందించవు. నేషలైజ్డ్ బ్యాంకులు లేదా ఐసీఐసీఐ, యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీ వంటి ప్రముఖ ప్రైవేటు బ్యాంకులు మాత్రమే అందిస్తున్నాయి.
పీపీఎఫ్ ఖాతా అందిస్తున్న బ్యాంకులు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, ఓరియంటర్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలహాబాద్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పంజాబ్ నేషనల్ బ్యాంక్, దేనా బ్యాంక్, విజయా బ్యాంక్. ఈ బ్యాంకులన్నీ ప్రభుత్వానికి, పెట్టుబడిదారునికి మధ్య వారధిగా మాత్రమే పనిచేసి పీపీఎఫ్ ఖాతా తెరిచేందుకు సహాయపడతాయి. మీరు పీపీఎఫ్ ఖాతాలో జమచేసిన డబ్బు ప్రభుత్వానికి చేరుతుంది.
అర్హతలు
- భారతీయులు మాత్రమే పీపీఎఫ్ ఖాతాను తెరిచేందుకు వీలుంటుంది. ఎన్నారైలకు అవకాశం లేదు.
- ఒకవేళ భారతీయుడైన వ్యక్తి ఖాతాను తెరిచిన తర్వాత ఎన్నారైగా మారితే.. ఆ ఖాతాను మెచ్యూరిటీ వరకు కొనసాగించవచ్చు.
- మైనర్ పిల్లల పేరుతో తల్లిదండ్రులు/గార్డియన్ పీపీఎఫ్ ఖాతాను తెరవవచ్చు.
- ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు లేదా ఉమ్మడిగా ఖాతా తెరిచే వీలులేదు.
కావాల్సిన పత్రాలు..
- ఖాతా తెరించేందుకు - ఫారం 'ఎ' (ఇది ఖాతా తెరిచే బ్యాంకు/పోస్టాఫీసులో లభ్యమవుతుంది)
- కేవైసీ పత్రాల వెరిఫికేషన్ కోసం వ్యక్తి గుర్తింపు పత్రం (ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ, విద్యుత్ బిల్లు, వాటర్ బిల్లు)
- నివాస చిరునామా ఫ్రూఫ్
- పాన్ కార్డ్
- ఖాతా తెరిచేవారి పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్
- నామినీ ఫారం - 'ఇ' (ఇది కూడా ఖాతా తెరిచే బ్యాంకు/పోస్టాఫీసులో లభ్యమవుతుంది)
పీపీఎఫ్ ఖాతా ఆన్‌లైన్‌లో తెరిచే విధానం..
- పీపీఎఫ్ ఖాతా తెరించేందుకు వీలున్న ఏదైనా జాతీయ బ్యాంక్ లేదా ప్రైవేట్ బ్యాంక్ ఖాతాదారులు.. వారి నెట్ బ్యాంకింగ్ సేవలను వినియోగించుకుని పీపీఎఫ్ ఖాతాను తెరవొచ్చు.
- ముందుగా మీ నెట్ బ్యాంకింగ్ పోర్టల్‌కి లాగిన్ అవ్వాలి.
- పోర్టల్‌లో అందుబాటులో ఉండే ‘ఓపెన్ పీపీఎఫ్ అకౌంట్’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ ‘మీ పేరు’తో లేదా ‘మైనర్ పేరు’తో ఖాతా తెరవాలనుకుంటున్నారా? అనేది ఎంచుకోవాలి.
- నామినీ వివరాలు, బ్యాంక్ వివరాలతో పాటు అవసరమైన సమాచారాన్ని ఎంటర్ చేయాలి.
- మీరు ఎంటర్ చేసిన స్క్రీన్‌పై కనిపిస్తున్న, పాన్ తదితర వివరాలను మరోసారి తనిఖీ చేసుకోవాలి.
- ప్రతి ఏడాదీ ఒకేసారి డబ్బు జమ చేయాలనుకున్నా, లేదా వాయిదాల పద్ధతిలో జమ చేయాలనుకున్నా, నిర్దిష్ట కాలవ్యవధిలో డబ్బు బ్యాంకు పొదుపు ఖాతా నుంచి డిడక్ట్ చేసి పీపీఎఫ్ ఖాతాకు జమ చేసేలా నిర్దిష్ట సూచనలు ఇవ్వొచ్చు.
- ఈ వివరాలు ఇచ్చిన తర్వాత మీ రిజిష్టర్డ్ మొబైల్ నంబరుకి వచ్చిన ‘ఓటీపీ’ని ఎంటర్ చేయాలి.
- వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత పీపీఎఫ్ ఖాతా తెరుచుకుంటుంది. భవిష్యత్తు రిఫరెన్స్ కోసం స్క్రీన్‌పై కనిపిస్తున్న ఖాతా నంబరును భద్రపరచుకోవాలి.
- కొన్ని బ్యాంకులు ఆన్‌లైన్ ఫారం సబ్మిట్ చేసినప్పటికీ రిఫరెన్స్ నంబరుతో పాటు మీరు ఎంటర్ చేసిన సమాచారానికి సంబంధించిన పత్రాలను, మీ కేవైసీతో పాటు అందించాలని కోరవచ్చు.
గమనిక: పీపీఎఫ్ ఖాతాను తెరిచే విధానం అన్ని బ్యాంకులకూ ఒకేవిధంగా ఉండకపోవచ్చు. చిన్న చిన్న మార్పులు, చేర్పులు ఉండొచ్చు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
BJP: ఏదైనా ఉంటే డైరెక్ట్‌గా చేయాలి తప్ప ఇలానా?: భాజపా నేత ఇంద్రసేనారెడ్డి
-
Sports News
IND vs ENG: జడేజా ఈజ్ బ్యాక్.. అతడుంటే ఓ భరోసా..!
-
Movies News
Naresh: ముదిరిన నరేశ్ కుటుంబ వివాదం.. పవిత్రను చెప్పుతో కొట్టబోయిన రమ్య
-
Politics News
Maharashtra: బలపరీక్ష ‘సెమీ-ఫైనల్’లో శిందే వర్గం విజయం!
-
Crime News
Hyderabad News: సాఫ్ట్వేర్ ఇంజినీర్ దారుణహత్య.. గొంతు నులిమి పెట్రోల్ పోసి తగులబెట్టారు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope : రాశిఫలం ( జులై 03 - 09 )
- IND vs ENG : ఇటు బుమ్రా.. అటు వరుణుడు
- Rent: భర్తను అద్దెకు ఇస్తున్న మహిళ.. రెంట్ ఎంతో తెలుసా?
- Samantha: కరణ్.. అన్‌హ్యాపీ మ్యారేజ్‌కి మీరే కారణం: సమంత
- Jadeja-Anderson : 2014 ఘటన తర్వాత అండర్సన్‌కు ఇప్పుడు జ్ఞానోదయమైంది: జడేజా
- RaviShastri: బుమ్రా బ్యాటింగ్‌కు రవిశాస్త్రి ఫిదా.. బీసీసీఐ ప్రత్యేక వీడియో..!
- ఇంతందం.. ఏమిటీ రహస్యం?
- Diabetes food chart: ఇవి తినండి...షుగర్ తగ్గించుకోండి
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (03-07-2022)
- IND vs ENG: ముగిసిన రెండో రోజు ఆట.. టీమ్ఇండియాదే పైచేయి