రియ‌ల్ ఎస్టేట్‌లో పెట్టుబ‌డికి ఎలాంటి జాగ్ర‌త్త‌లు అవ‌స‌రం?

నిక‌ర ఆదాయం క‌లిగిన వారు చాలా మంది ఆస్తులు పెంచుకోవ‌డం కోసం అనేక చోట్ల పెట్టుబ‌డులు పెడుతుంటారు. బ్యాంక్‌లు, పోస్టాఫీసులు, స్టాక్ ఎక్స్ఛేంజీలు, బంగారం మొద‌లైన చోట్ల త‌మ డ‌బ్బును పెట్టుబ‌డిగా పెడుతుంటారు. రియ‌ల్ ఎస్టేట్‌లో పెట్టుబ‌డులు ముందు చూపు ఉన్న‌ట్లు ప‌రిగ‌ణించ‌వ‌చ్చు. అయితే, దీనికి అధిక మొత్తాలు అవ‌స‌ర‌మ‌వుతాయి. న‌గ‌దు లిక్విడ్ రూపంలో డిపాజిట్ చేసి ఉంటే ఎప్పుడైనా మ‌ధ్య‌లోనే తీసుకోవాల‌ని అనిపించ‌వ‌చ్చు. అయితే రియ‌ల్ ఎస్టేట్‌లో పెట్టుబ‌డులు అయితే ప్ర‌తి చిన్న అవ‌స‌రం గురించి తీసుకోవాల‌ని అనిపించ‌దు. కొంత మంది త‌మ ఇంటికి పెట్టే పెట్టుబ‌డినే రియ‌ల్ ఎస్టేట్ పెట్టుబ‌డిగా ప‌రిగ‌ణించేవాళ్లు ఉంటారు. ఇంటి ప‌రిమాణాన్ని బ‌ట్టి అద్దెల‌కు ఇచ్చుకోవ‌చ్చు. అధిక లాభార్జ‌న అవ‌కాశ‌మొచ్చిన‌పుడు ఇంటి విక్ర‌యానికి పెట్టొచ్చు.

రియ‌ల్ ఎస్టేట్‌లో పెట్టుబ‌డి పెట్ట‌డం అనేది లాభ‌దాయ‌క‌త కోసం ఎల్ల‌ప్పుడూ మంచి ఎంపిక‌గా ప‌రిగ‌ణించ‌బ‌డుతుంది. అందువ‌ల్ల పెట్టుబ‌డి నుండి గ‌రిష్ట ఆదాయాన్ని సంపాదించ‌డానికి కొన్ని అంశాల‌ను గుర్తుంచుకోవ‌డం చాలా అవ‌స‌రం. ఇంటి మీద పెట్టుబ‌డి పెట్టేట‌పుడు ఆస్తి ఉన్న స్థానంతో పాటు ఇంటి డిజైన్‌, నాణ్య‌త కూడా ప్ర‌ధాన పాత్ర పోషిస్తాయి. ఊహించ‌లేని ప‌రిస్థితుల‌ను ఎదుర్కొనేట‌పుడు ఇల్లు జీవిత పొదుపు వ‌న‌రుగా ప‌నిచేస్తుంది. 

ఆస్తి స్థానంః

రియ‌ల్ ఎస్టేట్‌లో పెట్టుబ‌డి పెట్టేట‌ప్పుడు ప‌రిగ‌ణించ‌వ‌ల‌సిన ముఖ్య‌మైన ప్ర‌మాణాల‌లో ప్రాప‌ర్టీ లొకేష‌న్ ఒక‌ట‌ని దీనికి సంబంధించిన మార్కెట్ నిపుణులు అంటున్నారు. విద్యాల‌యాలు, మార్కెట్‌లు, ప్ర‌భుత్వ, ప్రైవేట్ కార్యాల‌యాలు, ర‌వాణా సౌక‌ర్యాలు స‌మీపంలోనే ఉండ‌టం, ఇత‌ర ప్రాంతాల‌కు క‌నెక్ట్ కాబ‌డి ఉంద‌ని నిర్ధారించుకోవాలి.  అయితే, వీటి ధర కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. సిటీ కి దూరంగా ఉన్న ఆస్తి ధర కాస్త తక్కువగా ఉండవచ్చు.

ఆస్తి రూప‌క‌ల్ప‌నః

మంచి డిజైన్‌తో నిర్మించిన ఇల్లు ఎక్కువ సంవ‌త్స‌రాలు పూర్త‌యిన త‌ర్వాత కూడా కొత్త‌గానే అనిపిస్తుంది. ఒక భ‌వ‌నాన్ని మంచి నిర్మాణ సంస్థ రూపొందించిన‌ప్పుడు, బాగా డిజైన్ చేసిన‌పుడు, ప్రీమియం నాణ్య‌త క‌లిగిన ఉత్ప‌త్తులు ఇంటికి వాడ‌టం వ‌ల‌న ఇంటి నిర్మాణం బాగుండడ‌మే కాకుండా భ‌విష్య‌త్తులో మ‌ర‌మ్మ‌త్తు, నిర్వ‌హ‌ణ ఖ‌ర్చులు త‌గ్గుతాయి, త‌ద్వారా ఆస్తి విలువ పెరుగుతుంది. కాబ‌ట్టి ఇటువంటి వాటినే కొనుగోలు చేయ‌డం ఉత్త‌మం.

ఆస్తి నాణ్య‌తః

అత్యాధునిక నిర్మాణ సాంకేతిక‌త‌ల‌ను, తాజా ప‌రిక‌రాల‌ను ఉప‌యోగించే డెవ‌ల‌ప‌ర్లు అధిక నాణ్య‌త‌, మ‌న్నికైన‌ భ‌వ‌నాల‌ను అంద‌చేస్తారు. ఈ భ‌వ‌నాలు అనేక కాల ప‌రీక్ష‌ల‌ను త‌ట్టుకుని నిల‌బ‌డ‌గ‌ల‌వు. 

అద్దె సంపాద‌నః

ఇల్లు విలువ పెర‌గ‌డంతో పాటు, య‌జ‌మానికి ఇంటి అద్దె ఆదాయం కూడా వ‌స్తుంది. బాగా డిజైన్ చేయ‌బ‌డిన‌, నాణ్య‌మైన మెటీరియ‌ల్‌, నిర్మాణ సాంకేతిక‌త‌ల‌ను ఉప‌యోగించిన ఒక ప్ర‌ధాన ప్ర‌దేశంలో ప్రాప‌ర్టీని ఎంచుకోవ‌డం వ‌ల‌న ఇంటి అద్దె రూపంలో అద‌న‌పు ఆదాయం వ‌స్తుంది. ఉద్యోగ విర‌మ‌ణ చేసిన వారికి ఈ ఇంటి అద్దెలు ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రుగా కూడా ఉంటాయి, వారికి ఒకే ఇల్లు ఉన్నట్టయితే రివర్స్ మోర్ట్ గేజ్ కింద బ్యాంకు కి ఇల్లు తాకట్టు పెట్టి నెల నెలా ఆదాయం పొందొచ్చు.

ఆస్తి క్లియర్ టైటిల్:

మీరు ఒకరి వద్ద స్థలం లేదా ఇల్లు కొంటున్నట్టయితే వాటి పత్రాలను క్షుణ్ణంగా  పరిశీలించాలి. కొన్ని ఆస్తులు వివాదాల్లో ఉంటాయి, అలాంటివి కొనుగోలు చేస్తే మీరు ఇబ్బందులకు గురవుతారు. కాబట్టి, ఒక న్యాయవాది ని సంప్రదించి వాటికి తగినన్ని జాగ్రత్తలు తీసుకోవడం మేలు.

నిర్మాణం లో ఉన్న ఆస్తి:

మీరు నిర్మాణం లో ఉన్న ఫ్లాట్ లేదా ఇల్లు కొంటున్నట్టయితే వాటికి తగినన్ని అనుమతులు అందాయి లేదా తెలుసుకోవాలి. ఇలాంటి వాటికి రేరా(RERA) రిజిస్ట్రేషన్ ఉన్నట్టయితే కొంత వరకు మీ పని సులువు అయినట్టే. రేరా నియమాల ప్రకరాం సరైన సమయంలో ఫ్లాట్ నిర్మాణం జరగకపోతే బిల్డర్ మీకు తగినంత మూల్యం చెల్లించాలిసి ఉంటుంది.

ఆస్తి విక్ర‌యంః

ఏదైనా రియ‌ల్ ఎస్టేట్ పెట్టుబ‌డి నిజ‌మైన విలువ విక్ర‌యిస్తున్న‌ప్పుడే తెలుస్తుంది. ఈ విష‌యంలో వేగ‌వంత‌మైన విక్ర‌యం, విలువ అత్యంత కీల‌క‌మైన‌ది. ఇంటి వయసు పెరిగే కొద్దీ అమ్మడం కష్టదాయకం అవుతుంది.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని