LPG: వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్‌ ధర పెంపు..!

గ్యాస్‌ ధరలు మరోసారి పెరిగాయి. వాణిజ్య సిలిండర్ల ధరను నేటి నుంచి పెంచాలని చమురు సంస్థలు నిర్ణయించాయి.  

Published : 01 Jan 2023 11:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నూతన సంవత్సరం తొలిరోజే చమురు మార్కెటింగ్‌ కంపెనీలు 19 కేజీల వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్‌ ధర(LPG price)ను రూ.25 పెంచాయి. ఇది దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. దీంతో వాణిజ్య సిలిండర్‌ ధర దిల్లీలో రూ.1768, ముంబయిలో రూ.1,721, కోల్‌కతాలో రూ.1,870, చెన్నైలో రూ. 1,971కి చేరుకొన్నాయి. తాజా పెంపు ప్రభావం రెస్టారెంట్లు ఇతర వాణిజ్య సంస్థలపై పడనుంది.

ఇక గృహాల్లో వినియోగించే సిలిండర్‌ ధర(LPG price)ల్లో ఏ మార్పులు చేయలేదు. హైదరాబాద్‌లో వాణిజ్య సిలిండర్‌ ధర రూ.1973కు చేరింది. నగరంలో 14.2 కేజీల డొమెస్టిక్‌ గ్యాస్ సిలిండర్‌ ధర రూ.1,105గా ఉంది. ఈ విభాగంలో నవంబర్‌, డిసెంబర్‌ ధరల్లో ఎటువంటి మార్పు రాలేదు. గతేడాది జనవరిలో రూ.952 సిలిండర్‌ ధర డిసెంబర్‌ నాటికి రూ.1,105కు చేరుకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని