ప్రైమ‌రీ మార్కెట్ vs సెకండ‌రీ మార్కెట్

స్టాక్ మార్కెట్ ను రెండు ర‌కాలుగా వ‌ర్గీక‌రించారు. ప్రైమ‌రీ మార్కెట్, సెకండ‌రీ మార్కెట్. ప్రైమ‌రీ మార్కెట్ - ఇనీషియ‌ల్ ప‌బ్లిక్ ఆఫ‌ర్(ఐపీఓ) గురించి వింటుంటాం క‌దా. అది జ‌రిగే మార్కెట్ నే ప్రైమ‌రీ మార్కెట్ అంటారు. సెక్యురిటీల‌ను (షేర్లు,బాండ్లు…) సంస్థలు లేదా ప్ర‌భుత్వం నేరుగా జారీ చేసే మార్కెట్ ను ప్రైమ‌రీ మార్కెట్ అని అంటారు....

Published : 16 Dec 2020 13:15 IST

ప్రైమ‌రీ మార్కెట్, సెకండ‌రీ మార్కెట్ మ‌ధ్య తేడా ఏంటో తెలుసుకుందాం.

స్టాక్ మార్కెట్ ను రెండు ర‌కాలుగా వ‌ర్గీక‌రించారు. ప్రైమ‌రీ మార్కెట్, సెకండ‌రీ మార్కెట్. ప్రైమ‌రీ మార్కెట్ - ఇనీషియ‌ల్ ప‌బ్లిక్ ఆఫ‌ర్(ఐపీఓ) గురించి వింటుంటాం క‌దా. అది జ‌రిగే మార్కెట్ నే ప్రైమ‌రీ మార్కెట్ అంటారు. సెక్యురిటీల‌ను (షేర్లు,బాండ్లు…) సంస్థలు లేదా ప్ర‌భుత్వం నేరుగా జారీ చేసే మార్కెట్ ను ప్రైమ‌రీ మార్కెట్ అని అంటారు. సెకండ‌రీ మార్కెట్ - సాధార‌ణంగా స్టాక్ మార్కెట్ గురించి మ‌నం విన్న‌పుడు ఫ‌లానా షేరు ధ‌ర ఇంత పెరిగింది. ఫ‌లానా సూచీ ఇంత త‌గ్గింది అని వింటుంటాం. అయితే ఇదంతా జ‌రిగేది ఎక్క‌డ అని అడిగితే స‌మాధానం స్టాక్ ఎక్స్ఛేంజీ అని చెబుతాం. దీన్నే సెకండ‌రీ మార్కెట్ అంటారు. మ‌దుప‌ర్లు నుంచి మ‌దుప‌ర్ల‌కు షేర్ల బ‌దిలీ, లావాదేవీలు సెకండ‌రీ మార్కెట్ లోనే జ‌రుగుతాయి. తొలిసారిగా షేర్ల‌ను జారీ చేసే మార్కెట్ ను ప్రైమ‌రీ మార్కెట్ అని, ఒక సారి జారీ అయిన పెట్టుబ‌డి సాధ‌నాలు ట్రేడింగ్ జ‌రిగే మార్కెట్ ను సెకండ‌రీ మార్కెట్ అని అంటారు. 

ప్రైమ‌రీ మార్కెట్ సాధ‌నాల‌కు ఉదాహ‌ర‌ణ‌గా ఇనీషియ‌ల్ ప‌బ్లిక్ ఆఫ‌ర్ (ఐపీఓ), ఫాలో ఆన్ ప‌బ్లిక్ ఆఫ‌ర్ (ఎఫ్‌పీఓ) చెప్ప‌వ‌చ్చు. సెకండ‌రీ మార్కెట్ సాధ‌నాలకు ఉదాహ‌ర‌ణ‌గా షేర్ల ట్రేడింగ్, బాండ్ల ట్రేడింగ్ చెప్ప‌వ‌చ్చు. ప్రైమ‌రీ మార్కెట్ , సెకండ‌రీ మార్కెట్ మ‌ధ్య ఉన్న తేడాల‌ను గ‌మ‌నించ‌గ‌ల‌రు

STOCK-TABLE.png

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని