Public sector Banks: ప్రభుత్వ బ్యాంకులు అప్రమత్తంగా ఉండాలి: నిర్మలా సీతారామన్‌

Public sector Banks: ప్రస్తుత అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తదితర అంశాలపై నిర్మలా సీతారామన్‌ పీఎస్‌బీలకు దిశానిర్దేశం చేశారు.

Updated : 26 Mar 2023 09:37 IST

దిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు(పీఎస్‌బీలు) వడ్డీ రేట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఒత్తిడి పరీక్షలను క్రమం తప్పకుండా చేపట్టాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సూచించారు. అమెరికా, ఐరోపాలోని కొన్ని బ్యాంకుల వైఫల్యం నేపథ్యంలో దేశీయంగా ఉన్న పీఎస్‌బీల పని తీరుపై సమీక్షించేందుకు ఆమె శనివారం సమావేశం నిర్వహించారు. వివిధ ఆర్థిక అంశాలు సదరు బ్యాంకుల్లో ఎలా ఉన్నాయి? ప్రస్తుత అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తదితర అంశాలపై ఆమె పీఎస్‌బీలకు దిశానిర్దేశం చేశారు. 2 గంటల పాటు కొనసాగిన సమావేశంలో ఆయా పీఎస్‌బీల ఎండీలు, సీఈఓలు పాల్గొన్నారు. అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ (ఎస్‌వీబీ), సిగ్నేచర్‌ బ్యాంకుల వైఫల్యం, క్రెడిట్‌ సూయిజ్‌ సంక్షోభం నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్‌ కరాడ్‌, ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్‌ జోషి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని