Superplex: దేశంలో మరో 5 సూపర్‌ప్లెక్స్‌ల ఏర్పాటుకు పీవీఆర్‌ యోచన

ఇప్పటికే పీవీర్‌కు మూడు సూపర్‌ప్లెక్స్‌లు ఉన్నాయి. తాజాగా తిరువనంతపురంలో నాలుగోది ప్రారంభించింది. రానున్న రోజుల్లో మరో ఐదు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు తెలిపింది. తెలంగాణలోనూ ఏర్పాటుకు ఉన్న అవకాశాల్ని పరిశీలిస్తున్నట్లు పేర్కొంది.

Published : 25 Nov 2022 11:32 IST

తిరువనంతపురం: మల్టీప్లెక్స్‌లు సినిమా వ్యాపారాన్ని పూర్తిగా మార్చివేశాయి. ఒకే దగ్గర పలు తెరలను ఏర్పాటు చేసి సినీప్రియులు పొందే అనుభూతిని పెంచాయి. తాజాగా పీవీర్‌ వంటి బడా చిత్ర ప్రదర్శన కంపెనీలు సుపర్‌ప్లెక్స్‌లపై దృష్టిసారించాయి. అంటే ఓకే దగ్గర కనీసం పది తెరలను ఏర్పాటు చేస్తారు. తాజాగా తిరువనంతపురంలో గురువారం పీవీఆర్‌ ఓ కొత్త సూపర్‌ప్లెక్స్‌ను ప్రారంభించింది. దీంట్లో 12 తెరలు ఉండడం విశేషం. దీంతో పాటు కేరళలో తొలి ఐమ్యాక్స్‌ను కూడా పీవీఆర్‌ తిరువనంతపురంలోనే గురువారం ప్రారంభించింది.

దేశంలో ఇప్పటికే దిల్లీ, నోయిడా, బెంగళూరులో మూడు సూపర్‌ప్లెక్స్‌లు ఉన్నాయి. తాజాగా తిరువనంతపురంలో తెరిచింది నాలుగోది. రానున్న రోజుల్లో దిల్లీ, హరియాణా, కర్ణాటక, కేరళ, ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో ఐదు సూపర్‌ప్లెక్స్‌లు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు పీవీఆర్‌ చీఫ్‌ స్ట్రాటజీ ఆఫీసర్‌ ప్రమోద్‌ అరోరా తెలిపారు. గుజరాత్‌, తెలంగాణలోనూ సూపర్‌ప్లెక్స్‌ల ఏర్పాటుకు ఉన్న అవకాశాల్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. త్వరలో పీవీఆర్‌తో విలీనం కానున్న ఐనాక్స్‌కు సైతం దేశంలో మూడు మెగాప్లెక్స్‌లు ఉన్నాయి. ముంబయిలో 11 తెరలు, లఖ్‌నవూలో 10 తెరలతో కూడిన రెండు సూపర్‌ప్లెక్స్‌లను ఐనాక్స్‌ నిర్వహిస్తోంది.

ఒకే దగ్గర వివిధ రకాల కాలక్షేపాలు అందించే ప్రదేశాలుగా సూపర్‌ప్లెక్స్‌ లేదా మెగాప్లెక్స్‌లు అవతరిస్తాయని ఐనాక్స్‌ లీజర్‌ చీఫ్‌ ప్రోగ్రామింగ్‌ ఆఫీసర్‌ రాజేందర్‌ సింగ్‌ జ్యాలా తెలిపారు. ఇది సినిమా ప్రియుల అనుభూతిని మరింత పెంచుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts