Radhika Merchant: అంబానీ కోడలు రాధిక హ్యాండ్ బ్యాగ్ ధర రూ.అర కోటి!
Radhika Merchant: అనంత్ అంబానీ, ఆయనకు కాబోయే భార్య రాధిక మర్చంట్ (Radhika Merchant) జంట ఎన్‌ఎంఏసీసీ ప్రారంభోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాధిక చేతిలో ఉన్న చిన్న బ్యాగ్ అందరి దృష్టిని ఆకర్షించింది.
ముంబయి: రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ కలల ప్రాజెక్ట్ ‘నీతా ముకేశ్ అంబానీ సాంస్కృతిక కేంద్రం (NMACC)’ శుక్రవారం ప్రారంభమైంది. ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దేశంలోని పలువురు రాజకీయ, సినిమా, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు. అయితే, ఈ వేడుకలో అనంత్ అంబానీ, ఆయనకు కాబోయే భార్య రాధిక మర్చంట్ (Radhika Merchant) జంట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఇటీవలే నిశ్చితార్థం పూర్తి చేసుకున్న ఈ జంట.. ఎన్‌ఎంఏసీసీ ప్రారంభోత్సవానికి నల్లని రంగు దుస్తుల్లో వచ్చారు. ఇండో వెస్ట్రన్ స్టైల్ లేస్ శారీలో వచ్చిన రాధిక (Radhika Merchant).. అనంత్ అంబానీతో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు. ఆ సమయంలో రాధిక చేతిలో ఉన్న చిన్న బ్యాగ్ అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే, అది చాలా ఖరీదైందని నెట్టింట్లో చర్చ జరుగుతోంది. దీనిపై కొంత లోతుగా పరిశోధన చేసిన బాలీవుడ్‌షాదీస్.కామ్ అనే వెబ్‌సైట్ ఆ బ్యాగు విలువను వెల్లడించింది. అది దాదాపు రూ.52 లక్షలు ఖరీదు చేస్తుందని తెలిపింది. సిల్వర్ రంగులో ఉన్న ఈ హెర్మిస్ కెల్లీమోర్ఫోస్ బ్యాగ్‌లో మిక్ ఫ్రంట్ ఫ్లాప్, సిగ్నేచర్ కెల్లీ డిజైన్‌తో పాటు చైన్‌మెయిల్ బాడీ, షార్ట్ స్ట్రాప్, క్లోచెట్‌తో కూడిన పొడవాటి భుజం గొలుసు ఉన్నాయి. ఈ బ్యాగ్‌కు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇదీ ఆ బ్యాగ్ ప్రత్యేకత..
ఫ్యాషన్ రంగంపై అవగాహన ఉన్నవారికి హెర్మిస్ బ్రాండ్ గురించి తెలిసే ఉంటుంది. ఈ కంపెనీ తమ డిజైనర్ బ్యాగ్‌లను కెల్లీగా నామకరణం చేసింది. దీనికి వెనక కూడా ఓ కథ ఉంది. అమెరికాకు చెందిన ప్రఖ్యాత నటి గ్రేస్ కెల్లీ ఈ బ్యాగును ఎప్పుడూ తన వెంట తీసుకెళ్లేవారు. ముఖ్యంగా ఆమె గర్భం దాల్చినప్పుడు.. దీన్ని అడ్డుగా పెట్టుకునేవారట. దాంతో ఈ బ్యాగ్‌లు చాలా పాపులర్ అయ్యాయి. అప్పటి నుంచి హెర్మిస్ వీటికి హెర్మిస్ కెల్లీ అని పేరు మార్చింది. తర్వాత ఈ బ్యాగ్‌లకు ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తించి హెర్మిస్ కెల్లీమోర్ఫోస్ పేరిట ఆభరణాలను కూడా విడుదల చేసింది. అందులోనూ ఈ బ్యాగ్‌ను కంటిన్యూ చేసింది. ఇది చూడ్డానికి బ్యాగ్‌లాగే కనిపిస్తున్నప్పటికీ.. నిజానికి ఇది ఒక ఆభరణాల సెట్ అని చెప్పాలి. దీంట్లోని ఒక్కో భాగం ఒక్కో ఆభరణం. ఈ బ్యాగ్‌కు ఉండే చిన్న చైన్‌లను చెవి పోగుల్లా ధరించొచ్చు. అలాగే బెల్ట్‌ను మెడ చుట్టూ ధరించే చోకర్‌లా పెట్టుకోవచ్చు.
‘ఎన్‌కోర్ హెల్త్‌కేర్’ సంస్థ సీఈఓ వీరేన్ మర్చంట్- శైలా మర్చంట్ కుమార్తె రాధిక (Radhika Merchant). ముకేశ్ అంబానీ-నీతా అంబానీల చిన్న కొడుకు అనంత్ అంబానీకి కాబోయే భార్య. న్యూయార్క్ యూనివర్సిటీలో పాలిటిక్స్, ఎకనమిక్స్ విభాగాల్లో డిగ్రీ పూర్తిచేసిన ఆమె.. ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా కొన్నాళ్లు పనిచేసింది. ప్రస్తుతం ఎన్‌కోర్ హెల్త్‌కేర్ బోర్డు డైరెక్టర్‌గా వ్యవహరిస్తోంది. జనవరిలో రాధిక, అనంత్‌ల నిశ్చితార్థం ఘనంగా జరిగింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
YSRCP: పాతపట్నం ఎమ్మెల్యేకు గిరిజనుల నిరసన సెగ
-
India News
Maharashtra: ఆడపిల్ల పుట్టిందని ఏనుగుపై ఊరేగింపు
-
India News
పాఠశాల భోజనంలో పాము.. 25 మంది విద్యార్థులకు అస్వస్థత
-
Politics News
Balakrishna-Jr NTR: ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్
-
Movies News
iifa 2023 awards winners: ఉత్తమ నటుడు హృతిక్ రోషన్.. నటి అలియా భట్
-
Ap-top-news News
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు