Rahul Bajaj: బజాజ్‌ గ్రూప్ మాజీ ఛైర్మన్‌ రాహుల్ బజాజ్‌ కన్నుమూత

ప్రముఖ వ్యాపారవేత్త, బజాజ్‌ గ్రూప్ మాజీ ఛైర్మన్ రాహుల్ బజాజ్(83) శనివారం కన్నుమూశారు.

Updated : 12 Feb 2022 19:07 IST

పుణె: ప్రముఖ వ్యాపారవేత్త, బజాజ్‌ గ్రూప్ మాజీ ఛైర్మన్ రాహుల్ బజాజ్ (83) శనివారం కన్నుమూశారు. మహారాష్ట్రలోని పుణెలో ఆయన తుదిశ్వాస విడిచినట్లు బజాజ్ గ్రూప్ ప్రకటన విడుదల చేసింది. చివరి క్షణాల్లో కుటుంబ సభ్యులు ఆయన చెంతనే ఉన్నారని అందులో పేర్కొంది.

1965లో బజాజ్‌ గ్రూప్‌ బాధ్యతలను రాహుల్‌ బజాజ్‌ స్వీకరించారు. 2005లో తన విధుల నుంచి తప్పుకోగా.. ఆయన కుమారుడు రాజీవ్ బజాజ్‌ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఆయన ఇద్దరు కుమారులు రాజీవ్, సంజీవ్‌ సంస్థ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. గతేడాది ఏప్రిల్‌లో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గానూ వైదొలిగారు. గౌరవ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు.

2006 నుంచి 2010 వరకు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన ఆయన్ను కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్‌తో సత్కరించింది. ఆయన మరణం పట్ల పలువురు రాజకీయ, వ్యాపార ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ట్వీట్‌ చేశారు.






Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని