Indian Railway: రైలు ప్రయాణంలో సమస్యలా.. ఇదిగో ఇలా ఫిర్యాదు చేయండి..!
Railway complaints: రైల్వే ప్రయాణికుల నుంచి ఫిర్యాదుల స్వీకరణకు రైల్ మదద్ పేరిట సేవలను రైల్వే శాఖ అందిస్తోంది. ప్రయాణికులు వివిధ వేదికల ద్వారా ఫిర్యాదు చేసేందుకు వీలు కల్పిస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: దూర ప్రయాణమనగానే ఎక్కువ మంది ఓటేసేది రైళ్లకే. తక్కువ ఖర్చుతో సౌకర్యవంతంగా ప్రయాణించే వీలు దీని సొంతం. అయితే, రైల్వే సేవలపై చాలా మందికి ఫిర్యాదులున్నాయి. టాయిలెట్లు బాగాలేవనో, ఫ్యాన్లు తిరగడం లేదనో ప్రయాణికులు తరచూ ఆందోళన వ్యక్తంచేస్తుంటారు. అయితే, ఇలా అసౌకర్యం ఎదురైనా ఫిర్యాదు చేయడానికి మాత్రం చాలా మంది ముందుకు రారు. వాస్తవానికి రైల్వే శాఖ ప్రయాణికుల నుంచి ఫిర్యాదుల స్వీకరణకు రైల్ మదద్ (Rail Madad) పేరిట సేవలను అందిస్తోంది. ప్రయాణికులు వివిధ వేదికల ద్వారా ఫిర్యాదు చేసేందుకు వీలు కల్పిస్తోంది.
రైల్వే ప్రయాణం సౌకర్యవంతంగా ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేయాలన్న సంకల్పంతో ఈ సౌకర్యాన్ని రైల్వే శాఖ తీసుకొచ్చింది. 24×7 ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ప్రయాణంలో ఏ సమస్య అయినా ఫిర్యాదు చేయొచ్చు. ఇందుకోసం రైల్ మదద్ వెబ్సైట్, యాప్, 139 టోల్‌ఫ్రీ నంబర్‌ను రైల్వే శాఖ అందుబాటులో ఉంచింది. ఇ-మెయిల్, పోస్ట్, సోషల్ మీడియా ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చని రైల్వే శాఖ తెలిపింది. ప్రస్తుతం రోజుకు 5,226 ఫిర్యాదులు వస్తున్నాయని, సగటున ఒక గంటా 19 నిమిషాల్లోనే ఫిర్యాదులను పరిష్కరిస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఫిర్యాదు.. పరిష్కారమిలా..
రైల్వే ప్రయాణంలో ఏదైనా సమస్య తలెత్తినప్పుడు పైన తెలిపిన ఏ వేదిక ద్వారానైనా రైల్వే శాఖకు ఫిర్యాదు చేయొచ్చు. ఇందుకోసం పీఎన్ఆర్ నంబర్, మీ వ్యక్తిగత ఫోన్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఫిర్యాదు చేసిన వెంటనే ఆర్పీఎఫ్, ఎలక్ట్రికల్, హౌస్‌కీపింగ్.. ఇలా ఆ ఫిర్యాదు ఏ విభాగానికి చెందినదో ఆ విభాగానికి ఎస్సెమ్మెస్ ద్వారా అలెర్ట్ వెళుతుంది. టీటీఈకి కూడా సంబంధిత ఫిర్యాదు అందుతుంది. ఇదే ఫిర్యాదు డివిజన్ కంట్రోల్ సెల్‌కూ వెళుతుంది. అక్కడి సిబ్బంది రైలులోని ఆన్ బోర్డ్ సిబ్బందితో సమన్వయం చేస్తూ ఫిర్యాదు పరిష్కారమయ్యేలా చూస్తారు. మీరు చేసిన ఫిర్యాదుకు గానూ RRN నంబర్ మీకు అందుతుంది. ఆ నంబర్ ఆధారంగా మీ ఫిర్యాదు స్థితిని తెలుసుకోవచ్చు. అలాగే మీ ఫిర్యాదు పరిష్కారమైన వెంటనే ఎస్సెమ్మెస్ ద్వారా ఆ విషయం తెలియజేస్తారు. దానికి మీరు రేటింగ్ కూడా ఇవ్వొచ్చు.
చివరిగా: చాలా మంది రైల్వే సేవలపై అసంతృప్తి వ్యక్తంచేసేవారే కానీ.. ఫిర్యాదులు చేయడానికి మాత్రం ముందుకు రారు. సులువుగా ఫిర్యాదు చేసి పరిష్కరించుకునే వీలున్నప్పటికీ తాత్సారం చేసే వారే అధికం. మీరు చేసే ఫిర్యాదు మీకే కాదు మీ తోటి ప్రయాణికులకూ ఉపయోగపడొచ్చు. కాబట్టి ఇకపై రైలు ప్రయాణంలో మీకెదురయ్యే సమస్యలపై ఫిర్యాదు చేయడం మరిచిపోవద్దు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడిలో మదుపు 10 శాతమే..
నాకు నెలకు రూ.60వేల వేతనం వస్తోంది. నా వయసు 39. ఇప్పటి వరకూ ఎలాంటి జీవిత బీమా పాలసీలనూ తీసుకోలేదు. ఇప్పుడు ఎలాంటి పాలసీలను తీసుకోవాలి. -
ఆరోగ్య బీమా: సమాచారం ఇస్తేనే మేలు
ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడు అప్పటి వరకూ ఉన్న ముందస్తు వ్యాధుల గురించి బీమా సంస్థకు తప్పనిసరిగా తెలియజేయాలి. -
మ్యూచువల్ ఫండ్స్‌లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్‌లైన్!
March 31 deadline: మ్యూచువల్ ఫండ్లలో మదుపు ప్రారంభించినప్పుడు విద్యుత్, గ్యాస్ బిల్లులు, బ్యాంకు ఖాతాలు సమర్పించి కేవైసీ నిబంధనలు పూర్తి చేసిన వారు.. మరోసారి తమ వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంది. -
Digilocker: డిజీ లాకర్‌తో ఆధార్, పాన్ వంటి పత్రాలు ఎప్పుడూ మీ వెంటే.. ఎలా దాచుకోవాలి?
DigiLocker: ప్రభుత్వం జారీ చేసిన ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఇలా అన్నీ ఒకేచోట డిజిటల్‌గా అందుబాటులో ఉంచేందుకు డిజీలాకర్‌ను ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇంతకీ ఇదెలా ఉపయోగపడుతుందో తెలుసా? -
కేవైసీ అప్డేట్ చేశారా?
బ్యాంకులో ఖాతా ఉందా? మ్యూచువల్ ఫండ్‌లో మదుపు చేస్తున్నారా? జీవిత, ఆరోగ్య బీమా పాలసీలున్నాయా? మరి, మీ కేవైసీ (మీ ఖాతాదారు గురించి తెలుసుకోండి) వివరాలు తెలియజేయడం తప్పనిసరి. -
IRCTC refund: ఐఆర్సీటీసీ రిఫండ్స్ ఇక వేగవంతం.. గంటలోనే నగదు వెనక్కి?
IRCTC refund process: రైలు టికెట్ బుక్ చేసినప్పుడు డబ్బులు డెబిట్ అయ్యాయా? ఇకపై ఆ సొమ్ము కోసం రోజులతరబడి ఎదురు చూడాల్సిన పనిలేదు. ఈ ప్రక్రియ వేగవంతం కానుంది. -
Paytm పేమెంట్స్ బ్యాంక్‌లో ఈ సేవలకు.. మరికొన్ని రోజులే గడువు
Paytm payments bank: ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో కొన్ని సేవలకు గడువు మార్చి 15తో ముగియనుంది. ఆ తర్వాత వాటిని కొనసాగించలేరు. -
Aadhaar Update: ఆధార్ ఉచిత అప్డేట్కు మరోసారి గడువు పొడిగింపు
ఆధార్‌లో వివరాలు ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు విధించిన గడువు తేదీని మరోసారి పొడిగిస్తున్నట్లు ఉడాయ్ తెలిపింది. -
ఆదాయపు పన్ను ఈ పొరపాట్లు చేయొద్దు
ఆదాయపు పన్ను భారం తగ్గించుకునేందుకు వివిధ పథకాల్లో పెట్టుబడి పెట్టేందుకు చట్టం అవకాశం కల్పించింది. కేవలం ఇలా మదుపు చేయడంతోనే పన్ను ప్రణాళిక పూర్తయినట్లు చాలామంది భావిస్తారు. ఆర్థిక ప్రణాళికలో పన్ను ఆదా పథకాలూ ఎంతో కీలకం. -
EPFO: పీఎఫ్ ఖాతాలో వివరాలు మార్చుకోవాలా? ఆన్లైన్లో సులువుగా..
EPFO: ఉద్యోగుల భవిష్య నిధి (EPF) చందాదారులా? మీ పీఎఫ్ ఖాతాలో వ్యక్తిగత వివరాలను మార్చుకోవాలనుకుంటున్నారా? ఈ ఆన్లైన్ ఫారమ్‌తో సులువుగా మార్చుకోవచ్చు. -
Indian Railways: ట్రైన్ టికెట్ చిరిగిపోయిందా? అయితే ఇలా చేయండి!
train ticket lost: ట్రైన్ టికెట్ పోయిందా? ప్రయాణం ఎలా అని కంగారు పడుతున్నారా? అయితే రైల్వే అందిస్తున్న ఈ సదుపాయం గురించి తెలుసుకోవాల్సిందే.. -
Solar rooftop: ‘సూర్యఘర్’కు దరఖాస్తు ఎలా? ₹78 వేల రాయితీ ఎలా పొందాలి?
PM Surya Ghar Muft Bijli Yojana: ఇంటిపై సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటే సబ్సిడీ ఇచ్చే పథకానికి కేంద్ర కేబినెట్ పచ్చజెండా ఊపింది. ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? సబ్సిడీ ఎలా పొందాలి? -
ఆరోగ్య బీమా క్లెయిం తిరస్కరిస్తే
చిన్న అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్తేనే వేల రూపాయలు ఖర్చవుతున్నాయి. దీన్ని తట్టుకోవాలంటే.. ఆరోగ్య బీమా ఇప్పుడు ఒక తప్పనిసరి అవసరంగా మారింది. చాలామంది ఈ పాలసీని తీసుకుంటున్నప్పటికీ.. దీన్ని పూర్తిగా అర్థం చేసు కోవడంలో కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. -
FasTag: పేటీఎం ఫాస్టాగ్ వాడుతున్నారా? ప్రత్యామ్నాయాలు ఇవే..!
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ జారీ చేసిన ఫాస్టాగ్‌లు త్వరలో చెల్లుబాటుకాకుండా పోనున్నాయి. దీంతో కొత్తవి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రత్యామ్నాయాలు ఇవీ.. -
PM Kisan: రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ నిధులు ఎప్పుడంటే?
PM Kisan 16th installment: పీఎం కిసాన్ లబ్ధిదారులకు గుడ్‌న్యూస్. ఫిబ్రవరి 28వ తేదీన ఈ నిధులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. -
పేటీఎం ఫాస్టాగ్‌లు ఏం చేయాలి? సౌండ్ బాక్స్‌ల మాటేంటి? RBI సమాధానాలివే..!
RBI releases Paytm FAQs: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు సంబంధించి వినియోగదారుల నుంచి తరచూ ఎదురవుతున్న ప్రశ్నలకు ఆర్బీఐ సమాధానాలు ఇచ్చింది. -
8 ఏళ్లలో రూ.45లక్షలు..
నాకు నెలకు రూ.55వేల వేతనం వస్తోంది. వయసు 38. ఇప్పటి వరకూ ఎలాంటి జీవిత బీమా పాలసీలు లేవు. నేను ఎంత మొత్తానికి పాలసీ తీసుకోవాలి? -
IPO: ఐపీఓకి దరఖాస్తు చేస్తుంటే
IPO: స్టాక్ మార్కెట్లో ఇప్పుడు ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్)లు జోరు నడుస్తోంది. అనేక సంస్థలు ప్రజల నుంచి మూలధన నిధులను సమీకరించేందుకు ముందుకు వస్తున్నాయి -
PM Surya Ghar: ఉచిత విద్యుత్ పథకం.. ‘రూఫ్‌టాప్ సోలార్’ కోసం దరఖాస్తు ఇలా..
PM Surya Ghar- Muft Bijli Yojana: కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్ అందించేందుకు కేంద్రం ‘పీఎం సూర్య ఘర్’ పథకం ప్రారంభించింది. దీని కింద ‘రూఫ్‌టాప్ సోలార్’ కోసం దరఖాస్తు చేసుకోండిలా..! -
Blue Aadhaar: బ్లూ ఆధార్ కార్డు ఎవరికిస్తారు? దరఖాస్తు ఎలా?
Blue Aadhaar Card: యూఐడీఏఐ పిల్లల కోసం ప్రత్యేకంగా నీలం రంగులో ఆధార్ కార్డుల (Blue Aadhaar card)ను జారీ చేస్తోంది. దీన్ని బాల ఆధార్ (Baal Aadhaar) కార్డుగా వ్యవహరిస్తారు. -
Fastag KYC: ఫాస్టాగ్ కేవైసీ గడువు పొడిగించిన ఎన్హెచ్ఏఐ
ఫాస్టాగ్ కేవైసీ అప్డేట్ గడువును పొడిగిస్తున్నట్లు ఎన్హెచ్ఏఐ ప్రకటించింది. ఫిబ్రవరి 29 వరకు వెసులుబాటు కల్పించింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్‌గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు