Ratan Tata: ఎలక్ట్రిక్‌ నానో కారులో రతన్‌ టాటా

ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా గ్యారేజీలో మరో కొత్త కారు వచ్చి చేరింది. టాటా గ్రూప్‌నకు చెందిన విద్యుత్‌ వాహనాల సంస్థ ‘ఎలక్ట్రా ఈవీ’ అభివృద్ధి చేసిన సరికొత్త

Updated : 10 Feb 2022 12:54 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా గ్యారేజీలో మరో కొత్త కారు వచ్చి చేరింది. విద్యుత్తు వాహనాల సంస్థ ‘ఎలక్ట్రా ఈవీ’ అభివృద్ధి చేసిన సరికొత్త 72వీ నానో విద్యుత్తు కారు రతన్‌ టాటాకు చేరింది. ఈ విషయాన్ని ‘ఎలక్ట్రా ఈవీ’ లింక్డ్‌ఇన్‌ ఖాతాలో వెల్లడించింది. టాటాకు కారు డెలివరీ చేసినందుకు గర్వంగా ఉందని, ఆయన నుంచి ఫీడ్‌బ్యాక్‌ కూడా తీసుకున్నామని తెలిపింది. 

‘‘ఎలక్ట్రా ఈవీకి ఇవి ఆనంద క్షణాలు. మా వ్యవస్థాపకుడు రతన్‌ టాటా సరికొత్త 72వీ నానో విద్యుత్‌ కారులో ప్రయాణించారు. టాటాకు నానో ఈవీ డెలివరీ చేయడం, ఆయన నుంచి అమూల్యమైన ఫీడ్‌బ్యాక్‌ తీసుకోవడం అత్యంత గౌరవంగా భావిస్తున్నాం’’ అని ఎలక్ట్రా ఈవీ పోస్ట్‌లో రాసుకొచ్చింది. నానో ఈవీ పక్కన టాటా తన అసిస్టెంట్‌ శంతను నాయుడితో కలిసి దిగిన ఫొటోను కూడా షేర్‌ చేసింది. 

టాటా నానో ఈవీ.. ఫోర్‌ సీటర్‌ కారు.  ఒక్క సారి ఛార్జింగ్‌ చేస్తే 160 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఆధునిక వినియోగదారుడికి పర్యావరణ అనుకూలమైన వ్యక్తిగత రవాణాను అందించడమే లక్ష్యంగా ఈ నానో ఈవీని ఆవిష్కరించినట్లు గతంలో టాటా మోటార్స్‌ వెల్లడించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని