Capital gains tax: మూలధన లాభాల పన్ను హేతుబద్ధీకరణకు కేంద్రం యోచన

దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను నిర్మాణంలో మార్పులు చేసేందుకు కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన ప్రకటన వచ్చే బడ్జెట్‌లో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

Published : 25 Nov 2022 12:12 IST

దిల్లీ: దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను నిర్మాణాన్ని హేతుబద్ధీకరించే అంశాన్ని కేంద్ర ఆర్థికశాఖ పరిశీలిస్తున్నట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సారూప్యత ఉన్న ఆస్తుల మధ్య సమానత్వం, ఇండెక్సేషన్‌ లాభాల మదింపు ప్రాతిపదిక సంవత్సరాన్ని సమీక్షించడం వంటి మార్పులు చేసే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఒక ఏడాది కంటే ఎక్కువకాలం అట్టిపెట్టుకొని ఉన్న షేర్లపై 10 శాతం దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను విధిస్తున్నారు. స్థిరాస్తులు; రెండేళ్ల కంటే ఎక్కువకాలం అట్టిపెట్టుకొని ఉన్న నమోదుకాని షేర్లు; మూడేళ్ల కంటే ఎక్కువ కాలపరిమితి ఉన్న ఆభరణాలు, డెట్‌ సాధనాల విక్రయంపై 20 శాతం పన్ను వర్తింపజేస్తున్నారు.

పన్ను రేట్లను హేతుబద్ధీకరించడంతోపాటు దీర్ఘకాలిక మూలధన లాభాలను లెక్కించేందుకు పరిగణనలోకి తీసుకునే గడువును మార్చే అంశాన్ని ఇప్పుడు రెవెన్యూశాఖ పరిశీలిస్తోందని సదరు అధికారి తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే 2023-24 బడ్జెట్‌లో దీనికి సంబంధించిన ప్రకటన ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రాతిపదిక సంవత్సరాన్ని మార్చాలని యోచిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 2001 బేస్‌ ఇయర్‌గా ఉన్న విషయం తెలిసిందే. క్యాపిటల్‌ గెయిన్స్‌ ట్యాక్స్‌ నిర్మాణాన్ని మరింత సరళతరం చేసి, పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూర్చేలా తీర్చిదిద్దడమే తమ ప్రధాన ఉద్దేశమని అధికారి తెలిపారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని