Ravish Kumar: ఎన్డీటీవీకి రవీశ్‌కుమార్‌ గుడ్‌బై.. ఇకపై యూట్యూబ్‌లోనే..

ఎన్డీటీవీలో సుదీర్ఘకాలం పాటు పనిచేసిన సీనియర్‌ జర్నలిస్టు రవీశ్‌ కుమార్‌ ఆ సంస్థను వీడారు. ఎన్డీటీవీలో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన గ్రూప్‌ నుంచి వైదొలిగారు.

Updated : 01 Dec 2022 13:55 IST

దిల్లీ: ఎన్డీటీవీ (NDTV)లో సుదీర్ఘకాలం పాటు పనిచేసిన సీనియర్‌ జర్నలిస్టు, రామన్‌ మెగసెసె అవార్డు గ్రహీత రవీశ్‌ కుమార్‌ ఆ సంస్థను వీడారు. NDTVలో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన రాజీనామా చేశారు. ఎన్డీటీవీలో ప్రమోటర్‌ సంస్థ అయిన ఆర్‌ఆర్‌పీఆర్‌ హోల్డింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు సంస్థ వ్యవస్థాపకులు రాధికా రాయ్‌, ప్రణయ్‌ రాయ్‌ రాజీనామా చేసిన మరుసటి రోజే రవీశ్‌ కుమార్‌ వైదొలగడం గమనార్హం.

రవీశ్‌ రాజీనామాను ఎన్డీటీవీ గ్రూప్‌ ప్రెసిడెంట్‌ సుపర్ణ సింగ్‌ ధ్రువీకరించారు. రవీశ్‌ కుమార్‌ రాజీనామా విషయాన్ని సంస్థ ఉద్యోగులకు ఈ-మెయిల్‌ ద్వారా తెలియజేశారు. రాజీనామా వెంటనే అమల్లోకి వచ్చినట్లు తెలిపారు. ఎన్డీటీవీని అదానీ గ్రూప్‌ టేకోవర్‌ చేస్తున్నట్లు చేసిన ప్రకటనకు కొద్ది రోజుల ముందే యూట్యూబ్‌ ఛానెల్‌ను ప్రారంభించిన రవీశ్‌.. ఇకపై ఆ మాధ్యమం ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలియజేశారు. ఎన్డీటీవీకి రాజీనామా చేశానని అందులో వెల్లడించారు. తన యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌కు మద్దతు కొనసాగిస్తారని అశిస్తున్నట్లు పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు