RBI dividend: ప్రభుత్వానికి ఆర్‌బీఐ భారీ డివిడెండ్.. గతేడాది కంటే ట్రిపుల్
RBI dividend to govt: కేంద్ర ప్రభుత్వానికి భారీ డివిడెండ్ చెల్లించేందుకు ఆర్‌బీఐ నిర్ణయించింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.87,416 కోట్లు చెల్లించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.
ముంబయి: కేంద్ర ప్రభుత్వానికి 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ భారీ డివిడెండ్ (Dividend) చెల్లించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ముందుకొచ్చింది. తమ వద్ద ఉన్న మిగులు నిధుల నుంచి రూ.87,416 కోట్లు డివిడెండ్‌గా చెల్లించేందుకు ఆర్‌బీఐ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ మొత్తం మూడింతలు అధికం కావడం గమనార్హం.
2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ ఆర్‌బీఐ డివిడెండ్ రూపంలో ప్రభుత్వానికి రూ.30,307 కోట్లు చెల్లించింది. ఇక ఇదే సమావేశంలో అంతర్జాతీయ, దేశీయ ఆర్థిక పరిస్థితులు, సవాళ్లపై ఆర్‌బీఐ బోర్డు చర్చించింది. అలాగే వీటిపై భౌగోళిక రాజకీయ పరిణామాల ప్రభావం గురించి చర్చ జరిగింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ పనితీరుతో పాటు, వార్షిక నివేదిక వంటి అంశాలు సైతం ఇందులో చర్చకు వచ్చాయి.
కరెన్సీ ట్రేడింగ్, బాండ్ల ట్రేడింగ్ నుంచి ఆర్‌బీఐకి ఆదాయం సమకూరుతుంది. దీంట్లో తన కార్యాకలాపాల కోసం కొంత మొత్తం పోనూ మిగులు నిధులను కేంద్ర ప్రభుత్వ ఆర్థిక అవసరాల కోసం అందజేస్తుంది. అయితే, గత కొంతకాలంగా డివిడెండ్ మొత్తం పెరుగుతూ వస్తోంది. 2012-13లో రూ.33,010 కోట్లుగా ఉన్న డివిడెండ్ మొత్తం.. 2018-19లో ఈ మొత్తం ఏకంగా రూ.1.76 లక్షల కోట్లకు చేరింది. మరోవైపు 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ, ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి రూ.48వేల కోట్ల మేర డివిడెండ్ వస్తుందని ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అంచనాల్లో ప్రభుత్వం పేర్కొంది. తాజాగా ఆర్‌బీఐ భారీ డివిడెండ్ అంచనాలను దాటేసింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Sattenapalli: కోడెల కుటుంబానికి న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు: నక్కా ఆనందబాబు
-
Sports News
WTC Final: ఆ సిరీస్ కంటే.. మాకిదే గ్రాండ్ ఫైనల్: ఆసీస్ టాప్ స్పిన్నర్ నాథన్ లైయన్
-
India News
Karnataka CM: ‘ఐదు గ్యారంటీల’కు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్.. ఈ ఏడాదే అమలు!
-
Sports News
‘ఆ పతకాలు మీవి మాత్రమే కాదు.. ఎలాంటి తొందరపాటు నిర్ణయం వద్దు’: కపిల్ సేన విన్నపం
-
Movies News
Pareshan movie review: రివ్యూ: పరేషాన్.. రానా సమర్పణలో వచ్చిన చిత్రం మెప్పించిందా?
-
Politics News
Chandrababu: తెదేపా అధికారంలో ఉంటే 2020 నాటికి పోలవరం పూర్తయ్యేది: చంద్రబాబు