Paytm Payments Bank: పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌పై ఆర్‌బీఐ ఆంక్షలు

పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ (Paytm Payments Bank)పై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) తాత్కాలిక ఆంక్షలు విధించింది.

Published : 11 Mar 2022 19:42 IST

ముంబయి: పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ (Paytm Payments Bank)పై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) తాత్కాలిక ఆంక్షలు విధించింది. కొత్త ఖాతాలను చేర్చుకోవడాన్ని తక్షణం నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఐటీ వ్యవస్థపై ఆడిట్‌ నిర్వహించేందుకు ఓ ఐటీ ఆడిట్‌ సంస్థను నియమించుకోవాలని సూచించింది. బ్యాంకులో పర్యవేక్షణ లోపాలు వ్యక్తమైన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు ఆర్‌బీఐ తన ఆదేశాల్లో పేర్కొంది.

బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌ 1949లోని సెక్షన్‌ 35ఏలోని అధికారాలను ఉపయోగించి ఈ ఆదేశాలు జారీ చేసినట్లు ఆర్‌బీఐ పేర్కొంది. ఐటీ ఆడిటర్లు ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకుని తదుపరి అనుమతులు ఇవ్వనున్నట్లు ఆర్‌బీఐ పేర్కొంది. పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ 2016 ఏర్పాటు అవ్వగా.. 2017 మేలో నొయిడా వేదికగా కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. పేటీఎం విజయ్‌ శేఖర్‌ శర్మకు ఇందులో 51 శాతం వాటా ఉంది. మరోవైపు 2020 డిసెంబర్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు సైతం ఆర్‌బీఐ ఇలాంటి ఆదేశాలే జారీ చేసింది. బ్యాంకులో తరచూ సాంకేతిక లోపాలు తలెత్తడంతో క్రెడిట్‌ కార్డులు జారీ చేయకుండా తాత్కాలిక నిషేధం విధించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని