RBI: బ్యాంకులు వాటిపై ఓ కన్నేసి ఉంచాలి: శక్తికాంత దాస్‌

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచాలని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ బ్యాంకులకు సూచించారు...

Published : 18 May 2022 20:19 IST

ముంబయి: ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలపై బ్యాంకులు ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచాలని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ సూచించారు. అవసరమైనప్పుడల్లా తగిన చర్యలూ తీసుకోవాలని తెలిపారు. బ్యాలెన్స్‌ షీట్లపై ప్రభావం పడకుండా మూలధనాన్ని సమకూర్చుకొని పెట్టుకోవడం వంటి అంశాలపై దృష్టి సారించాలని హితవు పలికారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక పరిస్థితులపై  బ్యాంకుల అధిపతులతో గవర్నర్‌ సహా ఆర్‌బీఐ అధికారులు రెండురోజుల పాటు సమావేశమయ్యారు.

కరోనా సమయంలో బ్యాంకులు ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచాయని శక్తికాంత దాస్‌ ఈ సందర్భంగా తెలిపారు. అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ సంక్షోభం నుంచి బ్యాంకింగ్‌ రంగం వేగంగా కోలుకుందని పేర్కొన్నారు. ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత బలోపేతం చేయడంపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే డిజిటల్‌ బ్యాంకుల ఏర్పాటు, ఐటీ, సైబర్‌ వ్యవస్థలను పటిష్ఠం చేయాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని