Repo rate: యథాతథంగానే వడ్డీరేట్లు.. నిపుణుల అంచనా!
Repo rate: ద్రవ్యోల్బణం దిగొస్తున్న నేపథ్యంలో వడ్డీరేట్లను ఈసారి కూడా యథాతథంగా కొనసాగించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ముంబయి: రెపోరేటు (Repo rate)ను ఈసారి కూడా ‘భారతీయ రిజర్వ్ బ్యాంక్’ (RBI) 6.5 శాతం వద్ద యథాతథంగా కొనసాగించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఏప్రిల్‌లో ద్రవ్యోల్బణం (inflation) తగ్గడం, రానున్న రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉండడమే అందుకు కారణమని వివరించారు. గతంలో రేట్లను పెంచడం వల్లే ద్రవ్యోల్బణం (inflation) దిగొస్తోందని పేర్కొన్నారు.
ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ (Shaktikanta Das) నేతృత్వంలో ‘ద్రవ్య పరపతి విధాన కిమిటీ (MPC)’ జూన్ 6-8 మధ్య సమావేశం కానుంది. సమావేశ నిర్ణయాలను జూన్ 8న ప్రకటించనున్నారు. చివరిసారి ఏప్రిల్‌లో జరిగిన సమావేశంలో రెపోరేటు (repo rate)లో ఎలాంటి మార్పు చేయకుండా 6.5 శాతం దగ్గర కొనసాగించారు. దీంతో 2022 మే నుంచి అనుసరిస్తున్న రేట్ల పెంపు ప్రక్రియకు విరామమిచ్చినట్లయింది. వరుస పెంపులతో రెపో రేటు 250 బేసిస్ పాయింట్ల మేర పెరిగింది.
ఏప్రిల్‌లో ‘వినియోగదారుల ధరల ఆధారిత ద్రవ్యోల్బణ సూచీ’ (CPI) 4.7 శాతంగా నమోదైంది. ఇది 18 నెలల కనిష్ఠం. మే నెలలో ఇది మరింత దిగొచ్చే అవకాశం ఉందని ఇటీవల ఓ సందర్భంలో శక్తికాంత దాస్ అన్నారు. జూన్ 12న మే నెల సీపీఐ గణాంకాలు వెలువడనున్నాయి. రూ.2,000 నోట్ల డిపాజిట్లు కొనసాగుతున్న నేపథ్యంలో ద్రవ్యలభ్యత పెరుగుతుందని బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రధాన ఆర్థికవేత్త మదన్ సబ్నవిస్ అన్నారు. ఈ నేపథ్యంలో సర్దుబాట విధాన వైఖరిని ఉపసంహరించుకోవడాన్ని ఆర్‌బీఐ కొనసాగిస్తుందని పేర్కొన్నారు. ఈ ఏడాది రెపో రేటు 25-50 బేసిస్ పాయింట్ల వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా వేశారు. అయితే, అది అక్టోబర్ తర్వాతే ఉండొచ్చని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Nayanthara: సినిమా ప్రమోషన్‌కు అందుకే నయన్ దూరం: విఘ్నేశ్ శివన్
-
Jyotiraditya Scindia: మేనత్త త్యాగం.. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో జ్యోతిరాదిత్య సింధియా?
-
TDP: చంద్రబాబు అరెస్టైన చోట.. తెదేపా పొలిటికల్ యాక్షన్ కమిటీ భేటీ
-
భారత హైకమిషనర్‌ను అడ్డుకున్న ఖలిస్థానీ సానుభూతిపరులు.. బ్రిటన్ గురుద్వారా వద్ద ఘటన
-
Chidambaram: మహిళా రిజర్వేషన్.. నీటిలో జాబిల్లి: కాంగ్రెస్ నేత చిదంబరం
-
ODI WC 2023: వరల్డ్ కప్ వారిదే.. ఫేవరెట్ టీమ్ చెప్పేసిన సునీల్ గావస్కర్