Digital rupee: 1 నుంచి డిజిటల్ రూపాయి.. ప్రయోగాత్మకంగా తొలుత ఈ నగరాల్లోనే
డిసెంబర్ 1 నుంచి రిటైల్ డిజిటల్ రూపాయిని (e₹-R) పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించనున్నట్లు ఆర్బీఐ (RBI) వెల్లడించింది. ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ సహా నాలుగు బ్యాంకులు ఇందులో పాల్గొంటాయి.
ముంబయి: దేశంలో డిజిటల్ రూపాయి వైపు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా డిసెంబర్ 1 నుంచి రిటైల్ డిజిటల్ రూపాయిని (e₹-R) పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించనున్నట్లు ఆర్బీఐ (RBI) వెల్లడించింది. ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ సహా నాలుగు బ్యాంకులు ఇందులో పాల్గొంటాయి. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ)గా వ్యవహరించే ఈ డిజిటల్ రూపాయికి సంబంధించి నవంబరు 1న పైలట్ ప్రాజెక్టుగా టోకు విభాగంలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
రిటైల్ డిజిటల్ రూపాయి ప్రయోగాల్లో భాగంగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో వినియోగదారులు, వ్యాపారులతో కూడిన ఎంపిక చేసిన సమూహం మధ్య ఈ లావాదేవీలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం కాగిత, నాణేలు ఉన్న విలువలతోనే డిజిటల్ రూపాయినీ జారీ చేయనున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ఈ మొత్తాన్ని బ్యాంకుల ద్వారా జారీ చేస్తామని, దీన్ని బ్యాంకులు అందించే డిజిటల్ వ్యాలెట్ సాయంతో వ్యక్తులు లావాదేవీలు నిర్వహించొచ్చని పేర్కొంది. వ్యక్తులు, వ్యక్తుల మధ్య; వ్యక్తులు-వ్యాపారుల మధ్య ఈ లావాదేవీలు జరిపేందుకు వినియోగించొచ్చని తెలిపింది. ఇప్పుడు ఉన్న నగదు పట్ల ఉన్న నమ్మకం, భద్రతనూ రిటైల్ డిజిటల్ రూపాయికీ తీసుకురానున్నట్లు ఆర్బీఐ తెలిపింది. తొలుత ముంబయి, దిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్ నగరాల్లో ఈ ప్రయోగాలు నిర్వహించనున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. భవిష్యత్‌లో మరిన్ని బ్యాంకులు, మరిన్ని ప్రాంతాలకు ఈ ప్రయోగాలు విస్తరించనున్నట్లు తెలిపింది.
సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) అనేది ప్రస్తుత కరెన్సీ నోట్లకు డిజిటల్ రూపం మాత్రమే. వీటికి ప్రత్యామ్నాయం కాదు. ప్రస్తుత నగదు కొనసాగుతుంది. అదనపు చెల్లింపు అవకాశాలను కల్పించేందుకే సీబీడీసీని తీసుకొచ్చేందుకు ఆర్బీఐ ఇది వరకే స్పష్టంచేసింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ కేంద్ర బ్యాంకులు సీబీడీసీలపై ఆసక్తి ప్రదర్శించాయి. కొన్ని ఇప్పటికే టోకు, రిటైల్‌లో ప్రయోగాత్మక ప్రాజెక్టులు మొదలుపెట్టగా.. మరికొన్ని సొంత సీబీడీసీలపై పరిశోధన, పరీక్షలు చేస్తున్నాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Rahul Gandhi: రాహుల్‌గాంధీతో ‘ఛోటా రాహుల్’!
-
Ap-top-news News
Andhra News: మా భూమిని లాక్కుంటే ఆత్మహత్య చేసుకుంటా..సెల్ఫీ వీడియో తీసి యువరైతు అదృశ్యం
-
Ap-top-news News
Andhra News: భోగాపురం ఎయిర్పోర్ట్ వద్ద ఒబెరాయ్ సంస్థకు 40 ఎకరాలు!
-
Ap-top-news News
Vande Bharat Express: ‘వందే భారత్’ వచ్చినప్పుడే కాపలానా?
-
Ap-top-news News
Rushikonda: వేంగి బ్లాక్ పూర్తికి టెండర్లు.. అక్కడే సీఎం క్యాంపు కార్యాలయం!
-
World News
US-China: 2025లో అమెరికా, చైనా మధ్య యుద్ధం?