e-rupee: త్వరలో ఇ-రూపీ విడుదల.. తొలుత ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాంతాల్లోనే..!

త్వరలోనే దేశంలో ఇ-రూపీని విడుదల చేయనున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. తొలుత ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే దీన్ని ప్రారంభించినున్నట్లు తెలిపింది.

Published : 07 Oct 2022 17:54 IST

ముంబయి: ‘సెంట్రల్‌ బ్యాంకు డిజిటల్‌ కరెన్సీ (CBDC)’ని త్వరలోనే ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నట్లు ‘రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI)’ శుక్రవారం ప్రకటించింది. ప్రస్తుతం పరిమిత స్థాయి వినియోగానికి ఈ ఇ-రూపీని తీసుకొస్తున్నట్లు తెలిపింది. ఈ పైలట్‌ ప్రాజెక్టును విస్తరిస్తున్న కొద్దీ సీబీడీసీ లక్షణాలు, ప్రయోజనాలను తెలియజేస్తామని పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం ఓ ‘కాన్సెప్ట్‌ నోట్‌’ను విడుదల చేసింది. దీంట్లో సీబీడీసీ వెనకున్న సాంకేతికత, భవిష్యత్తులో దీని ఉపయోగాలు, జారీ విధానం, డిజైన్‌ ప్రత్యామ్నాయాల వంటి వివరాలను వివరించింది. 

ప్రస్తుతం అందుబాటులో ఉన్న చట్టబద్ధమైన కరెన్సీకి ఇ-రూపీ అదనపు వెసులుబాటు మాత్రమేనని ఆర్‌బీఐ కాన్సెప్ట్‌ నోట్‌ పేర్కొంది. బ్యాంకు నోట్లతో పోలిస్తే ఇది ఏమాత్రం భిన్నమైంది కాదని తెలిపింది. కేవలం డిజిటల్‌ రూపంలో ఉండడమే ప్రత్యేకత అని వివరించింది. మరింత సులభంగా, వేగంగా, తక్కువ ఖర్చుతో లావాదేవీలు పూర్తవుతాయని పేర్కొంది. ఇతర డిజిటల్‌ మనీ తరహాలోనే అన్ని లావాదేవీ ప్రయోజనాలు ఇ-రూపీకి ఉంటాయని స్పష్టం చేసింది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts