15 నెల‌ల FDపై ఈ బ్యాంకులో 7.75 శాతం వ‌డ్డీ.. కేవలం వారికే!

ఆర్‌బీఎల్‌ బ్యాంక్ సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు ఉచిత డోర్‌-స్టెప్ బ్యాంకింగ్ సేవ‌ల‌ను అందిస్తుంది. 

Published : 20 Aug 2022 14:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సూప‌ర్ సీనియ‌ర్ సిటిజ‌న్లకు శుభ‌వార్త‌. అంతర్జాతీయ సీనియ‌ర్ సిటిజ‌న్స్ దినోత్సవం (ఆగస్టు 21) సంద‌ర్భంగా ఆర్‌బీఎల్ బ్యాంక్ సూప‌ర్ సీనియ‌ర్ సిటిజ‌న్ల కోసం అధిక వ‌డ్డీ రేటుతో ఎఫ్‌డీని ప్ర‌క‌టించింది. సూప‌ర్ సీనియ‌ర్ సిటిజ‌న్లు అంటే 80 ఏళ్లు అంత‌కంటే ఎక్కువ వ‌య‌సున్న వారు 15 నెల‌ల కాల‌ప‌రిమితి ఉన్న ఈ ఎఫ్‌డీలో పెట్టుబ‌డులు పెట్టి 7.75 శాతం వార్షిక వ‌డ్డీ రేటును పొందొచ్చు.

ఆర్‌బీఎల్‌ బ్యాంక్ అన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్లపై, ముఖ్యంగా 15 నెలల కాల‌వ్య‌వ‌ధితో కూడిన డిపాజిట్ల‌కు అధిక వ‌డ్డీ రేటు ఆఫ‌ర్ చేస్తోంది. కొత్తగా ప్రారంభించిన ఎఫ్‌డీ కింద.. సూప‌ర్ సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు, సాధార‌ణ డిపాజిట్‌దారుల‌కంటే మ‌రో 0.75 శాతం అదనపు వడ్డీ రేటును అందిస్తోంది. ఆర్‌బీఎల్ బ్యాంక్ సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు 15 నెల‌ల ఎఫ్‌డీపై అత్య‌ధికంగా 7 శాతం వార్షిక వ‌డ్డీ ఆఫ‌ర్ చేస్తుండ‌గా.. సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు మ‌రో 0.50 శాతం అద‌న‌పు వ‌డ్డీ అంటే 7.50 శాతం వార్షిక వ‌డ్డీని అందిస్తోంది. ఇప్పుడు కొత్త‌గా సూప‌ర్ సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు 7.75 శాతం వార్షిక వ‌డ్డీని అందించనున్నట్లు ప్రకటించింది. ఆర్‌బీఎల్‌ బ్యాంక్ వెబ్‌సైట్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఆర్‌బీఐ ఎంఓబ్యాంక్‌ యాప్, బ్రాంచ్‌లు, కాంటాక్ట్ సెంట‌ర్ ద్వారా ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌ను సుల‌భంగా బుక్ చేసుకోవ‌చ్చు. అంతేకాకుండా ఈ బ్యాంక్ సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు ఉచిత డోర్‌-స్టెప్ బ్యాంకింగ్ సేవ‌ల‌నూ అందిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని